తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం టాలీవుడ్ లో వినిపిస్తోంది. (మెగా 158)
మెగా 158 సినిమా
మెగా 158 : ఇటీవల సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు బాబీ దర్శకత్వంలో తన 158వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా 158 సినిమా ఇటీవలే ఓపెనింగ్ పూజా కార్యక్రమం జరిగింది. ఈ ఓపెనింగ్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా రావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయింది.
తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఈ సినిమా కథ అంతా బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని తెలుస్తోంది. కానీ మెగాస్టార్ పాత్ర మాత్రం పూర్తిగా ఆంధ్రా రూట్స్తోట ఉంటుందట. ఆయన డైలాగ్ డెలివరీలో పక్కా ఆంధ్రా యాస వినిపించేలా బాబీ ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నాడని టాక్. ఆంద్ర నుంచి వెళ్లి బెంగాల్లో ఆంధ్ర వ్యక్తి ఎలా డామినేట్ చేసాడు, అతని బ్యాక్‌స్టోరీ ఎలా ఉంటుందో అనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుందని టాక్.
ఇది కూడా చదవండి: Tejeswini Nandamuri : బాబోయ్.. బాలయ్య కూతుర్లో ఇంత ట్యాలెంట్ ఉందా.. డ్యాన్స్ అదరగొట్టిన తేజస్విని.. వీడియో వైరల్..
ఇక ఈ సినిమాలో చిరంజీవి మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్స్, చిరు మార్క్ కామెడీ కూడా ఉంటాయని సమాచారం. వాల్తేరు వీరయ్య లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ నారాయణ నిర్మిస్తుండగా ఈ సినిమాలో యంగ్ సెన్సేషన్ అనశ్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తుంది.

