నాగ బంధం ఫస్ట్ డే కలెక్షన్ : 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘నాగబంధం’ చిత్రం విడుదలకు ముందు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్, ఎంపిక కాన్సెప్ట్ , ఇలా ప్రతీ ఒక్కటి ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. కొత్తవాళ్లపై ఇంత బడ్జెట్ పెట్టి తెరకెక్కించారంటే , కచ్చితంగా ఈ సినిమాలో కంటెంట్ చాలా బలంగా ఉందేమో అని అంతా ఆశించారు. థియేట్రికల్ ట్రైలర్ కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ ప్రీ ప్రమోషనల్ కంటెంట్ కారణంగా ఈ చిత్రం మొదటి రోజు పర్వాలేదు అనే రేంజ్ లో ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి.
ట్రేడ్ విశ్లేషకులు అందించే సమాచారం ప్రకారం చూస్తుంటే ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 3 4 కోట్ల రూపాయల రేంజ్ లో షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కానీ నిర్మాతకు పెట్టిన బడ్జెట్ రీకవర్ అవ్వడానికి ఇది ఏ మాత్రం సరిపోదు. విడుదలకు ముందు కూడా థియేట్రికల్ బిజినెస్ బడ్జెట్ కి తగ్గట్టుగా జరగలేదు. తెలుగు రాష్ట్రాల్లో 22 కోట్ల రూపాయిల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ బిజినెస్ కూడా అత్యధిక అడ్వాన్స్ బేసిస్ మీద జరిగింది. అంటే థియేటర్స్ నుండి వచ్చే కలెక్షన్స్ మీదనే నిర్మాత సేవ్ అవుతాడా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. కానీ ఈ టాక్ కి బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకోవడం అసాధ్యమే అని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే, ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 10 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు ఫుల్ రన్ లో కూడా రావడం కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు.
దీనిని బట్టి నిర్మాతకు ఏ రేంజ్ దెబ్బ తగలబోతుందో అర్థం చేసుకోవచ్చు. సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది కాబట్టి సాటిలైట్ రైట్స్ ఓటీటీ రైట్స్ కూడా భారీ రేంజ్ లో అమ్ముడుపోవు. దీనితో మేకర్స్ 100 కోట్ల భారీ బడ్జెట్ ని బూడిదపాలు చేసారని అంటున్నారు. సరైన స్క్రిప్ట్ లేకుండా , ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఏం ఉపయోగం?, ఇప్పటికైనా మేకర్స్ నిద్ర లేస్తారో లేదో చూడాలి అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే గ్రాఫిక్స్ చిత్రాలు ఎలా ఉన్నా , ఎలాంటి టాక్ వచ్చినా మొదటి వీకెండ్ వరకు ఇలాంటి సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఉంటారు. వాళ్ళ కారణంగా వీకెండ్ లో అంచనా వేసిన దానికంటే ఎక్కువ వసూళ్లు రావొచ్చేమో చూడాలి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రం గంటకు 5 వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయి.

