నాగార్జున సినిమా రీమేక్: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున కెరియర్ మొదట్లోనే రొమాంటిక్ సినిమాలను చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత మాస్ కమర్షియల్ సినిమాలను చేస్తూనే ప్రయోగాత్మకమైన సినిమాల వైపు అడుగులు వేశాడు. ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఇక ఇండస్ట్రీలో ఎలాంటి కొత్త కథతో సినిమా రావాలన్నా అది నాగార్జున వల్లే సాధ్యమవుతుంది. అనేంతల పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. ఒకప్పుడు ఆయన ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల్లో ఒకడిగా నిలిచాడు. ఇప్పటికే ఆయన వరుస సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. గత సంవత్సరం కూలీ, కుబేర సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఇప్పుడు తన వందో సినిమా కోసం తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడు.
ఇక ఇప్పటికే 70% షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే నాగార్జున ఇంతకుముందు చేసిన కొన్ని సినిమాలను తమ వారసులు రీమేక్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారట. దానికి అనుగుణంగానే నాగార్జున, హరికృష్ణ చేసిన సీతారామరాజు సినిమా నాగ చైతన్య, అఖిల్ కలిసి రిలీజైనట్లు కనిపిస్తోంది.
ఆ సినిమా స్టోరీ ఇప్పటికీ రొటీన్ గా అయిపోయింది. కాబట్టి దాన్ని ఈ జనరేషన్ కి తగ్గట్టుగా కథ రూపంలో మార్చి ఇద్దరి క్యారెక్టర్లకి ఇంపార్టెన్స్ ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే నాగార్జున సినిమా రీమేక్ చేసే అవకాశం దక్కితే మాత్రం అక్కినేని అభిమానుల ఆనందాన్ని వ్యక్తం చేస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ఇక నాగచైతన్య చాలా రోజుల నుంచి నాగార్జునకి సంబంధించిన ఏదో ఒక సినిమా కోసం ఇప్పటికే చూస్తున్నాడు. ఇక దానికి తోడుగా అఖిల్ కూడా అతనితో జత కట్టడంతో ఇద్దరు కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమాని రూపొందించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది…

