Naveen Polishetty: యంగ్ హీరోల్లో కామిక్ టైమింగ్ అంటే మన అందరికీ గుర్తుండే ఒకరిద్దరు హీరోల్లో ఒకరు నవీన్ పోలిశెట్టి. ఇప్పటి వరకు ఆయన తీసిన ప్రతీ సినిమాలోనూ కామెడీ పీక్ రేంజ్ లో ఉంది. ‘జాతి రత్నాలు’, ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘అనగనగ ఒక రాజు’ చిత్రాలలో నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ చూస్తే పొట్ట చెక్కలు అవ్వాల్సిందే. సినిమాల్లో ఎంత ఫన్నీగా కనిపిస్తుంటారో , బయట కూడా అదే రేంజ్ ఫన్నీగా కనిపిస్తాడు నవీన్ పోలిశెట్టి. ఈయన ఇంటర్వ్యూ ని చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది. అంతే కాదు, తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా చాలా క్రియేటివ్ గా ప్రెజెంట్ చేసి అందిస్తారట నవీన్ పోలిశెట్టి. కాసేపటి క్రితమే ఆయన తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఒక వీడియో ని విడుదల చేశారు.
ఈ వీడియో లో ముందుగా ఆయన మాట్లాడుతూ ‘నా లైఫ్ లో కాస్ట్లీస్ట్ ఫ్రేమ్ ని మీ ముందు ఉంచబోతున్నాను’ అంటూ పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్న డైరెక్టర్స్ అందరినీ పరిచయం చేసాడు. ముందుగా లోకేష్ కనకరాజ్ ని చూపిస్తూ 500 కోట్లు అని , ఆ తర్వాత రిషబ్ శెట్టి ని 700 కోట్లు అని , ఆ తర్వాత పుష్ప నిర్మాత నవీన్ , సుకుమార్ లను చూపిస్తూ 2000 వేల కోట్లు అని, ప్రశాంత్ నీల్ ని చూపిస్తూ 1400 కోట్లు అని, నా సినిమాతో కలిపి మొత్తం 5500 కోట్ల కొత్త సినిమా చూపించారు. ఈ వీడియో లో పాపం హరీష్ శంకర్ కూడా ఉన్నాడు , ఆయన్ని పట్టించుకోలేదు అనుకోండి అది వేరే విషయం.
వీళ్లందరినీ చూపించిన తర్వాత చాలా తెలివిగా తన తదుపరి చిత్రానికి సంబంధించిన అప్డేట్ ని త్వరలోనే అని చెప్పుకొచ్చారు నవీన్ పోలిశెట్టి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ దున్నేస్తూ ముందుకు దూసుకువెళ్తోంది. నవీన్ పోలిశెట్టి తన అభిమానులను ఎప్పటికీ నిరాశ పరిచారు , ఇలాంటి సరికొత్త ఆలోచనలతో ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ నవీన్ పోలిశెట్టి ఎవరితో సినిమా చేయబోతున్నారు అనేది సస్పెన్స్ , కానీ ఒక కొత్త తో చేయబోతున్నాడని ప్రస్తుత డైరెక్టర్ ప్రస్తుతానికి స్పష్టంగా తెలియజేసారు. సోషల్ మీడియా ని దున్నేస్తున్న ఈ వీడియో మీకోసం క్రింద ఇస్తున్నాము చూడండి.
పాన్ ఇండియా రీల్ #ప్రశాంత్ నీల్ @అర్యసుక్కు @Dir_Lokesh @శెట్టి_రిషబ్ . @MythriOfficial ఇక్కడ మేము వెళ్ళాము. కొత్త చిత్రం త్వరలో లోడ్ అవుతోంది ❤️ వచ్చే ఏడాది కోసం చాలా ఉత్సాహంగా ఉంది pic.twitter.com/Zi5lJGS1Wy
— నవీన్ పోలిశెట్టి (@NaveenPolishety) జూన్ 25, 2026

