- బోన్‌లెస్ చికెన్‌ను మసాలాలతో కలిపి, నూనెలో ఉడికించాలి.
- ఊడికిన చికెన్‌కు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర జోడించాలి.
- పెరుగు, వెల్లుల్లి పేస్ట్, తాళింపు వేసి బాగా కలపాలి.
రైస్ మరియు రోటీస్ కోసం సులభమైన నేపాలీ చికెన్ చుకౌని రెసిపీ: చికెన్ ప్రోటీన్ కి మంచి సోర్స్. అందుకే దీనిని చాలామంది డైట్లో చేర్చుకుంటారు. కానీ ఇంట్లో చికెన్ చేసుకోవాలంటే చాలా మసాలాలు, నూనె వేసి చేస్తారు. అలా చేస్తేనే టేస్టీగా ఉంది అనుకుంటారు. కానీ మీరు ఒక్కసారి ఈ నేపాలి స్టైల్ చికెన్ చుకౌనీని చూస్తే మీరు కచ్చితంగా ఫిదా అయిపోతారు. తక్కువ టైం లో ఆయిల్ తగ్గించి.. టేస్టీగా తినాలంటే ఈ చికెన్ రెసిపీని కూడా ట్రై చేయవచ్చు. మరి దీనిని ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
చికెన్ – అరకిలో (బోన్‌లెస్)
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్లు
ఉప్పు – అర టీస్పూన్
మిరియాల పొడి – అర టీస్పూన్
కారం – టీస్పూన్
పసుపు – అర టీస్పూన్
నిమ్మరసం – 1 టీస్పూన్
– 1 టీస్పూన్ నూనె
ఉల్లిపాయ – 1 (పొడుగ్గా, సన్నగా తురుముకోవాలి)
పచ్చిమిర్చి – 1 (చిన్నగా కట్ చేసుకోవాలి)
కొత్తిమీర – మూడు టేబుల్ స్పూన్ల తురుము
యోగర్ట్ బేస్ కోసం
గ్రీక్ యోగర్ట్ – 1 కప్పు
వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
ఉప్పు – అర టీస్పూన్
పంచదార – అర టీస్పూన్
తాళింపు కోసం
ఆవాల నూనె – 1 టీస్పూన్
పసుపు – అర టీస్పూన్
కారం – అర టీస్పూన్
కసూరి మేతి – 1 టీస్పూన్
తయారీ విధానం..
ముందుగా చికెన్ శుభ్రం చేసుకుని ఓ పెద్ద గిన్నెలో తీసుకోవాలి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పెప్పర్, కారం, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు చికెన్‌ను ఓ పది లేదా పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చికెన్ మ్యారినేట్ అయిన తర్వాత ఓ పాన్ తీసుకోవాలి. స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టి.. దానిలో నూనె వేయాలి. వేడెక్కినప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఉడికించుకోవాలి.
మీడియం మంట మీద.. చికెన్ ని మధ్య మధ్యలో కలుపుతూ.. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత దానిని ఓ మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దానిలో ముందుగా కోసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము వేసుకుని కలుపుకోవాలి.
యోగర్ట్ బేస్ కోసం..
యోగర్ట్. వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పంచదార వేసి పక్కన పెట్టాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌవ్ వెలిగించి చిన్న తాళింపు కడాయి పెట్టి నూనె వేసి కాగానివ్వాలి. పొగనుంచి వస్తున్నప్పుడు స్టౌవ్ ఆపేసి.. దానిలో పసుపు, కారం, కసూరి మేతి వేసి వేయించుకోవాలి. ఈ తాళింపును ముందగా చికెన్ మిక్స్‌లో వేసి కలిపేయాలి. తర్వాత యోగర్ట్ మిక్స్ వేసి కలిపేయాలి.
చివరిగా కొత్తిమీర తురుము వేసి బాగా మిక్స్ చేసుకుంటే నేపాలీ స్టైల్ చికెన్ చుకానీ రెడీ. దీన్ని మీరు రోటీలు, వేడి వేడి అన్నంలో కలిపి తినొచ్చు. హెల్తీగా, టేస్టీగా చికెన్ తినాలనుకున్నప్పుడు త్వరగా చేసుకోగలిగే రెసిపీ ఇది. మీరు కూడా ఈ టేస్టీ నేపాలీ స్టైల్ రెసిపీని ట్రై చేయండి.
మరిన్ని టేస్టీ, ఈజీ రెసిపీల కోసం దీనిని క్లిక్ చేయండి.
శరీర కొవ్వు కోసం సింపుల్ యోగా | చెడు కొవ్వును సింపుల్ యోగాసనాలతో దూరం చేయండి

