నితీష్ కుమార్ రెడ్డి: ఎంత ఎత్తుకు ఎదిగినా సరే మూలాలు మర్చిపోకూడదు అని మన పెద్దలు అంటారు. దానిని నిజం చేసి చూపించాడు యంగ్ ప్లేయర్.. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. ఇప్పటికే అతడు ఐపిఎల్ లో.. టెస్ట్ క్రికెట్లో.. టి20 ఫార్మాట్లో అదరగొడుతున్నాడు. అనేక రికార్డులను సృష్టించాడు. మిడిల్ ఆర్డర్లో స్థిరమైన ఆటగాడిగా పేరుపొందాడు.
సిరీస్ లకు ఎంపికైనప్పటికీ గాయం వల్ల అతడు జట్టుకు దూరమయ్యాడు. అతడు కోలుకోవడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.. ఇతడు స్థానంలో సూర్యాంశ్ ను మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. ఇప్పటికే టీం ఇండియా ఐర్లాండ్, ఇంగ్లాండ్ దేశాలతో ఆడే టి20 సిరీస్ ల కోసం బయలుదేరి వెళ్లిపోయింది. నితీష్ కుమార్ రెడ్డి మాత్రం గాయానికి చికిత్స పొందుతున్నాడు. త్వరలోనే పూర్వపు ఫామ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.
గాయం వల్ల చికిత్స తీసుకుంటున్న నితీష్ కుమార్ రెడ్డికి కాస్త సమయం దొరికింది. సాధారణంగా అతడు నిర్విరామమైన క్రికెట్ ఆడుతున్నాడు. అందువల్లే మైదానం లేదా ఇంటికి మాత్రమే పరిమితం అవుతున్నాడు. అయితే నితీష్ కుమార్ రెడ్డి కిబ్ కాస్త సమయం దొరకడంతో ఈరోజు తన సొంత ఊరు గాజువాక వెళ్లిపోయింది. అతడి వెంట తల్లిదండ్రులు.. సోదరి కూడా ఉన్నారు. గాజువాక నితీష్ కుమార్ రెడ్డి సొంత ఊరు. ఇక్కడే అతడు పుట్టాడు. ఆ తర్వాత క్రికెట్లో మెలకువలు నేర్చుకుని అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ఈ నేపథ్యంలో తన నానమ్మకు ఊహించని కానుక అందించింది.. ఆమె కళ్ళల్లో ఆనందం చూశాడు.
నితీష్ కుమార్ రెడ్డి తన నానమ్మకు బంగారు గాజులు చేయించాడు. భారత్కు ఆడాలని ఆమె కోరికగా ఉండేది. ఆమె కోరికను కూడా నెరవేర్చాడు. నితీష్ ఆ ఊరికి రావడంతో సందడి వాతావరణం ఏర్పడింది.. నానమ్మకు స్వయంగా బంగారు గాజులు తొడిగి.. ఆమెను మరింత రెట్టింపు చేశాడు. తన మనవడితో తొడిగిన బంగారు గాజులను చూసి నితీష్ కుమార్ రెడ్డి నానమ్మ కన్నీటి పర్యంతమైంది. గాయంతో ఇబ్బంది పడుతున్న నితీష్ కుమార్ రెడ్డి.. పూర్తి స్థాయిలో సామర్థ్యం సాధించడానికి ఇంకా ఐదు వారాల దాకా సమయం పడుతుంది. ఆ తర్వాత అతడు జింబాబ్వే జట్టుతో మొదలయ్యే సిరీస్ ద్వారా మళ్లీ మైదానంలోకి అడుగు పెడతాడు.

