NRI BRS UK : ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు జన్మదిన వేడుకలను లండన్లో ఘనంగా నిర్వహించారు.
NRI BRS UK : ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు జన్మదిన వేడుకలను లండన్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ రెండు నిమిషాల మౌనం పాటించి ఘన నివాళులు అర్పించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసిన ఎన్నారై బీఆర్ఎస్ యూకే నాయకులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అమరవీరుల త్యాగాలు, ప్రజల చిరకాల ఆకాంక్షలు, కేసీఆర్ నాయకత్వంలో సాగిన ఉద్యమ ఫలితమని అన్నారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన ప్రతి ఒక్కరినీ స్మరించుకుంటూ, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణవాసులంతా కలిసి కృషి చేశారు.
ఉపాధ్యక్షులు సత్యమూర్తి చిలుముల మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసులు రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడం ఎంతో ముఖ్యమని అన్నారు. విదేశాల్లో తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన చెప్పారు.
యూత్ వింగ్ నాయకురాలు అమరేశ్వరి బోయిన మాట్లాడుతూ.. మా తరానికి తెలంగాణ ఉద్యమ చరిత్రను, కేసీఆర్ పోరాట విషయాల్ని ప్రస్తావించాలని సూచించారు. చరిత్ర తెలియక చాలామంది చౌకబారు రాజకీయ విమర్శలు, ప్రతీ సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు, కేసీఆర్పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేలా మనమంతా కృషి చేయాలని, పార్టీ సైతం చొరవ తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Nri
హరీశ్ రావు జన్మదినం
రాష్ట్రావతరణ వేడుకలతో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీశ్ రావు ప్రజలతో మమేకమై నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. ఆయన జన్మదిన సందర్భంగా ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నా బీఆర్ఎస్ యూకే నాయకులు అంజాన్ రావు మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీష్ రావు ప్రోత్సాహం మరువలేనిదని, మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రజా నాయుకుడు హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షులు నవీన్ రెడ్డి నేతృత్వంలో అంమూర్తి ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు హరిగౌడ్ నవాపేట్, చిలుముల, జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల, కార్యదర్శి (ఐటీ, మీడియా & పీఆర్) రవి ప్రదీప్ పులుసు, వెంకట్ రెడ్డి దొంతుల, సురేష్ బుడగం, రామకృష్ణ, పవన్ గౌడ్, జన్ రావు, అమరేశ్వరి, జగదీశ్, హరికృష్ణ, హరికృష్ణ ప్రవాస తెలంగాణవాసులు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు.

