OG సినిమా ప్రీమియర్ షోలు గ్రాస్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సరైన సినిమా పడితే , రికార్డ్స్ మామూలు రేంజ్ లో ఉండవు అని మొదటి నుండి అందరూ అంటుంటారు. ఆయనకు ఎన్ని ఫ్లాపులు పడినా, మరుసటి సినిమాకు బంపర్ ఓపెనింగ్స్ ని రప్పిస్తుంటాడు. గడిచిన రెండున్నర దశాబ్దాల నుండి మనం ఇదంతా చూస్తూనే ఉన్నాం. అయితే ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు , ఆ రంగం లోకి వెళ్ళిన తర్వాత కచ్చితంగా ఒక సెక్షన్ ఆడియన్స్ కి దూరం అవుతాడు, ఇక ఆయన సినిమాలకు ముందు వైభవం ఉండదని చాలా మంది అనుకున్నారు. కానీ నేటి తరం ఆడియన్స్ కి తగ్గట్టు ఒక్క సినిమా చేస్తే , ఇప్పటికీ ఆయన సినిమాలకు వసూళ్ల సునామీ వస్తుందని నిరూపించిన చిత్రం ‘ఓజీ’. కేవలం రెండంటే రెండు సినిమాల అనుభవం ఉన్న డైరెక్టర్ సుజిత్ తో కలిసి ఆయన సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు.
నేటి తరం యూత్ ఆడియన్స్ యూజీ మేనియా లో మునిగి తేలేలా చేశాడు . ఈ స్థాయిలో జెన్ జీ యూత్ ని అలరించిన చరిత్ర ఈమధ్య కాలంలో ఏ స్టార్ హీరో సినిమాకు కూడా జరగలేదు. ఓపెనింగ్స్ కూడా ఈ చిత్రానికి కనీవినీ ఎరుగని రేంజ్ లో వచ్చాయి. రెండు మూడు భాషలకు సంబంధించిన వసూళ్లు కలుపుకుంటే కానీ , వంద కోట్ల గ్రాస్ రానటువంటి ఈరోజుల్లో, ఈ చిత్రం కేవలం తెలుగు వెర్షన్ నుండి మొదటి రోజు 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి అంటే అర్థం చేసుకోవచ్చు , ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ఎలాంటిది. ముఖ్యంగా ఈ చిత్రం నమోదైన ప్రీమియర్ షోస్ గ్రాస్ వసూళ్లను ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ సినిమా కూడా అందుకోలేకపోయింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్ర ప్రీమియర్ షోస్ ద్వారా 63 కోట్ల రూపాయల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ రికార్డు ని కనీవినీ ఎరుగని రేంజ్ హైప్ తో విడుదలైన ‘ధురంధర్ 2’ కూడా బ్రేక్ చేయలేకపోయింది. కేవలం 60 కోట్ల గ్రాస్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక నేడు విడుదలైన ‘పెద్ది’ చిత్రం కచ్చితంగా ‘ఓజీ’ రికార్డుని బద్దలు కొడుతుందని అంతా అనుకున్నారు, కానీ సగం కూడా రాబట్టలేకపోయింది. ట్రేడ్ పండితులు అందించే సమాచారం ప్రకారం ఈ ప్రీమియర్ షోస్ నుండి 35 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు మాత్రమే నమోదు అయ్యాయి. ఇలా భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ రెండు సినిమాలు విఫలం అయ్యాయి , ఇప్పుడు ఈ రికార్డు ని భవిష్యత్తులో ఎవరు బద్దలు కొట్టబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం. వచ్చే ఏడాది విడుదల అవ్వబోయే ‘స్పిరిట్’, ‘వారణాసి’ చిత్రాలు ఈ రికార్డు ని కొడుతుందని ఆశిస్తున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

