ఓజీ2 చిత్రం (OG2) నుంచి నిర్మాత దానయ్య తప్పుకున్నారనే ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
OG2 చిత్రం నుండి DVV దానయ్య అవుట్ అయ్యారా
OG 2 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓజీ. ఈ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్ని లేదు. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని ఓజీ మూవీ చివరిలో స్పష్టం చేశారు. దీనితో అప్పటి నుంచి ఓజీ 2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఆదివారం సాయంత్రం (జూన్ 21) ఈ విషయంపై ఓ స్పష్టత వచ్చింది. పవన్ కళ్యాణ్‌తో దర్శకుడు సుజీత్ ఈ చిత్రం విషయమై చర్చలు జరుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ తెలియజేసింది. ఈ మేరకు ఓ ఫోటోను కూడా పంచుకుంది.
అయితే ఈ తాజా అప్డేట్లో ఓజీ చిత్ర నిర్మాణ సంస్థ డీవీ ఎంటర్టైన్మెంట్స్ ప్రస్తావన లేకపోవడం ఆసక్తికరంగా మారింది. సినీ వర్గాల సమా ప్రకారం ‘ఓజీ 2’ నిర్మాణ బాధ్యతల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు ప్రచారం. తొలి భాగం నిర్మాణ సమయంలో కొన్ని ఆర్థిక నిర్మాత దానయ్య, చిత్రబృందం మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా చివరి దశ చిత్రీకరణలో జపాన్ షెడ్యూల్ కోసం అదనపు నిధులు ఇవ్వడంపై సమస్యలు తలెత్తినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
వాగ్దానం చేసినట్లు @పవన్ కళ్యాణ్ , #OGయూనివర్స్ తో చర్చలు మొదలయ్యాయి @సుజీత్ సైన్ క్రియేటివ్ వర్క్స్‌లో! @మ్యూజిక్ థమన్#OG2 pic.twitter.com/6l7UzJUpvh
— పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ (@PKCWoffl) జూన్ 21, 2026
ఆ సమయంలో దర్శకుడు సుజిత్ స్వయంగా ముందుకొచ్చి తక్కువ సిబ్బందితో జపాన్‌లో చిత్రీకరణ పూర్తి చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. షూటింగ్ ఖర్చుల కోసం తన సొంత కారు అమ్మినట్లు ప్రచారం జరిగింది. ఇక మూవీ విడుదల అనంతరం సుజీత్ కృషిని గుర్తించిన పవన్ కళ్యాణ్ ఆయనకు కొత్త కారు బహుమతిగా ఇచ్చిన సంఘటన కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది.
సమంత : నా బిడ్డే నా ప్ర పంచం.. ఏళ్ల పాటు.. సమంత
ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం ‘ఓజీ 2’ను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, ఇకపై ఈ పవన్ చిత్రానికి సంబంధించిన అన్ని అప్డేట్లు కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ద్వారా వచ్చే అవకాశం ఉందని సమాచారం.

