OTR: పెద్దపల్లి జిల్లా కలెక్టర్… కోయ శ్రీహర్షకు సమర్ధుడన్న పేరు. ఎటువంటి సమస్యనైనా చాకచక్యంగా పరిష్కరిస్తారని కూడా చెబుతారు. కానీ… ఇప్పుడాయన వ్యవహార శైలిలో వచ్చిన ఆకస్మిక మార్పు జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇటీవల కొందరు పోలీసులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు కలెక్టర్. అది సాధారణమే, ఏర్పాటు ఏ డిపార్ట్మెంట్ అధికారులనైనా పిలిచి రివ్యూ చేస్తే అధికారం కలెక్టర్‌కు ఉంటుంది. కానీ… అసలు కథ… అక్కడే మొదలైందని అంటున్నారు కొందరు. ఖచ్చితంగా శాఖ నేరుగా కలెక్టర్‌కే రిపోర్టు చేయాలి కాబట్టి ఆ విషయంలో ఇబ్బంది లేదు. కానీ… పోలీసులను, లెవల్ ఆఫీసర్స్‌ను సైతం పిలిచి క్లాస్ పీకడం, అది కూడా అధికారులతో కలిపి వార్నింగ్ టైప్‌లో ఘాటుగా మాట్లాడడంపై చర్చ జరుగుతోంది.
నిర్వహించిన అందరు పోలీసు అధికారులను కాకుండా.. కేవలం సెలెక్టెడ్‌గా సమావేశానికి పిలిచారట కలెక్టర్. కొందరు అధికారుల పేర్లు పెట్టి మరీ పిలుస్తూ… మీ అందరి చిట్టా నా దగ్గర ఉంది… ఏమనుకుంటున్నారో కాస్త స్వరం పెంచి అన్నట్టు తెలిసింది. గోదావరిఖని సబ్ డివిజన్లో పనిచేస్తున్న ఒక ఇన్స్పెక్టర్, ముగ్గురు ఎస్ఐలతో పాటు మరో సబ్ డివిజన్‌కు చెందిన వైసీపీ, సీఐ, ఇద్దరు ఎస్ఐలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారట కలెక్టర్. భూ పంచాయితీలు ఎక్కువయ్యాయి, సివిల్ వివాదంలో తలదూరుస్తున్నారు, అడ్డగోలుగా అవినీతి చేస్తున్నారంటూ ఫైరయినట్టు సమాచారం. మట్టి, ఇసుక దందాలను ప్రోత్సహించడం మంచిది కాదని హితవు పలికిన కలెక్టర్….పేకాట ఆడితే పట్టుకోవాల్సింది పోయి కొందరు దగ్గరుండి ఆడిస్తున్నారని, మరికొందరు స్వయంగా ఆడుతున్నారంటూ మండిపడ్డట్టు సమాచారం. ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఏమైనా ఉంటుందా అంటూ… నాన్ స్టాప్‌గా ఎస్సైల నుంచి వైసీపీ వరకు అందరి బాగోతాలను బయటపెట్టడంతో బిక్కమొహం వేశారట పోలీసులు. అవినీతి సంగతి ఉన్నార… వాళ్ల ఆఫీసర్స్‌తో కలిపి వారికి క్లాస్ పీకడంతో ఫీలయ్య ఖాకీలు. లా అండ్ ఆర్డర్ కోసం మాకో బాస్ ఉన్నారు కదా… ఆయనతో చెప్పవచ్చు.. లేదంటే ఆయన్ని కూడా పిలిచి జైంట్ మీటింగ్ పెట్టవచ్చు. అదీ ఇదీ కాకుండా ఇలా చేయడం ఏంటంటూ మాట్లాడుకుంటున్నారట. తమ బాస్ రామగుండం సీపీ ద్వారా చెప్పిస్తే బాగుండేదన్నది పోలీస్ ఆఫీసర్స్ అభిప్రాయం. సాధారణంగా పోలీసు శాఖకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు వస్తే … ఎస్పీతోనో… లేదంటే సీపీ ద్వారానో చెప్పి చర్యలు తీసుకుంటారు. కానీ.. ఇక్కడ రామగుండం సీపీని దాటవేసి.. నేరుగా కిందిస్థాయి అధికారులను పిలిచి కలెక్టర్ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది.
సాధారణంగా సీఐలు, ఎస్ఐల పోస్టింగ్స్‌లో స్థానిక ఎమ్మెల్యేల ప్రమేయం ఉంటుంది. తమకు అనుకూలంగా ఉండే వారికి ఏరికోరి పోస్టింగ్స్ వేయించుకుంటారు శాసనసభ్యులు. ఆ విషయంలో వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి. అలాంటి పోస్టింగ్స్ వేయించుకున్న అధికారులు ఏం చేసినా.. లోకల్ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతాయనే విమర్శలు సైతం వస్తున్నాయి. అలాంటప్పుడు ఇటు సీపీకి చెప్పకుండా.. అటు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లకుండా కలెక్టర్ నేరుగా సీఐలు, ఎస్సైల మీద ఓ రేంజ్లో ఫైర్ కావడం వెనక ఆంతర్యం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఆ విధంగా కలెక్టర్ చేతంటించుకున్న అధికారులు నేరుగా తమకు సంబంధించిన ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్లి కలిసినట్లు సమాచారం. దాంతోపాటు తమ బాస్ అయిన రామగుండం సీపీకి విషయం చెప్పారట. 2009 బ్యాచ్ కు చెందిన CP అంబర్ కిషోర్ ఝా ఐజీ హోదాలో ఉన్నారు. సీనియర్ అయిన తనను సంప్రదించడమో… కనీసం సమాచారం ఇవ్వడమో చేయవచ్చు కదా… కలెక్టర్ వైఖరిపై ఆయన కూడా ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి మరో వాదన కూడా వినిపిస్తోంది. కేవలం రెండు నియోజకవర్గాల పరిధిలోని పోలీసులను మాత్రమే పిలిచి తలెక్టర్ వార్నింగ్ ఇవ్వడంతో సరికొత్త డౌట్స్ వస్తున్నాయట. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కలెక్టర్‌కు పొసగడం లేదా…? లేదంటే సదరు ఎమ్మెల్యేలే కలెక్టర్‌తో పోలీసులకు వార్నింగ్ ఇప్పించారా..? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెదుకుతున్నారు కొందరు. ఆ విధంగా ఈ స్పెషల్ క్లాస్ వెనక పొలిటికల్ కోణాలకు సంబంధించిన ఆరాలు కూడా నడుస్తున్నాయి. ఆ పోలీస్ అధికారులు తప్పు చేసి ఉంటే కలెక్టర్‌గా వారిని హెచ్చరించవచ్చుగానీ…అదే సమయంలో మీటింగ్‌కు సీపీని కూడా ఆహ్వానించి ఉంటే బాగుండేదన్నది పోలీస్ వర్గాల అభిప్రాయం. ఈ అగాథం ఇలాగే కొనసాగితే అడ్మినిస్ట్ వాతావరణం దెబ్బతింటుందని… గతంలో కరీంనగర్ వర్సెస్ కలెక్టర్‌గా సాగిన ఎపిసోడ్‌ను గుర్తు చేసుకుంటున్న కొంతమంది సీపీ.

