ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఆ నియోజకవర్గంలో నోనా…? ఒకవేళ వెళితే ఎందుకొచ్చావన్నట్టు లోకల్ ఎమ్మెల్యే చూస్తారా? అందుకు తగ్గట్టే మంత్రి సైతం ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా తన డిపార్ట్మెంట్ పనులను చక్కబెట్టేస్తున్నారా? మధ్య పిలుపుల పంచాయితీ సైతం నడుస్తోందా? ఎవరా ఇద్దరు నేతలు? ఇద్దరి మధ్య ఎందుకంత వైరం? రాజమండ్రి రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. నేతలు బయటికి బాగానే కనిపిస్తున్నారు, లోపల మాత్రం ఆధిపత్య యుద్ధం జరుగుతున్నట్టు అనుమానిస్తున్నారు చాలామంది. జనసేన మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే మధ్య పోరు నడుస్తున్నట్టు చెబుతున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇటీవల రాజమండ్రిలో జరుగుతున్న, అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి, ఒకరినొకరు ఆహ్వానించడం లేదని ప్రభుత్వ ఎమ్మెల్యే చెబుతున్నారు. మంత్రి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం లేకపోవడం, ఎమ్మెల్యే నిర్వహించే ప్రోగ్రామ్‌లలో మంత్రి పేరు కనిపించడం లేదని రొటీన్‌గా మారిందని అంటున్నారు. రాజమండ్రి సిటీలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల సంగతి లోకల్ ఎమ్మెల్యేకి తెలియడం లేదట. ఆ విషయంలో మంత్రి ఒంటెత్తు పోకడలకు పోతున్నారన్నది ఆదిరెడ్డి వర్గం అభియోగం. మరోవైపు స్థానికంగా మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ పాల్గొనకపోవడం కూడా చర్చనీయాంశం అయింది.
ఎమ్మెల్యే, మంత్రి ఇద్దరూ అధికార కూటమిలో భాగస్వాములే అయినా… ఒకరి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు మరొకరిని ఆహ్వానించారు కూటమి గ్యాప్‌తో పాటు జరిగే సమస్యలు పెరుగుతున్నాయి. మీరు పిలవనప్పుడు మేం ఎందుకు పిలవాలన్నది ఇరు పక్షాల ప్రశ్న. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలకు మంత్రి కూటమి తప్ప మిగిలిన స్థానిక జనసేన నాయకులకు మాత్రం ఆహ్వానాలు అందుతున్నాయి. ఆ రకంగా తమ పార్టీ నాయకులే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వెంట వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొనడం మంత్రి దుర్గేష్‌కు అస్సలు నచ్చడం లేదట. నగరంలో ఇటీవల ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల ఫ్లెక్సీల్లో ఎవరి ప్రోగ్రామ్‌లో వారి ఫోటోలు ఉండటం, మిత్రపక్షం నేతలవి కనిపించకపోవడం గురించి కూడా రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. మంత్రి దుర్గేష్ స్థానిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఫోటో వేయడం లేదట. అలాగే ఎమ్మెల్యే కార్యక్రమాల్లో మంత్రి ఫోటోను వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇవన్నీ ఉద్దేశ్యపూర్వకంగానే జరుగుతున్నాయన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట.
టీడీపీ శ్రేణులు మాత్రం “స్థానిక కార్యక్రమాల్లో ఇక్కడి ఎమ్మెల్యేకే ప్రాధాన్యత ఇవ్వడం సహజం” అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ వివాదానికి పర్యాటక ప్రాజెక్టులే కేంద్రంగా మారాయని చెబుతున్నారు. రాజమండ్రిలో రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్, పుష్కర్ ఘాట్ ఆధునికీకరణ, అఖండ గోదావరి ప్రాజెక్టు పనులన్నీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సాగుతున్నాయి. వీటి విషయంలో ఎమ్మెల్యే వాసు అసంతృప్తిగా ఉన్నారని రాజకీయ వర్గాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.”నా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని నాకు చెప్పారా అన్నది ఆయన ప్రశ్న. దుర్గేష్ రాజమండ్రి సిటీ జనసేన నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు తెలిసింది.
నాకు ఆహ్వానం లేని కార్యక్రమాలకు మీరు ఎందుకు వెళ్తున్నారంటూ ఆ మీటింగ్‌లో మంత్రి తన పార్టీ నాయకులను నిలదీసినట్లు తెలిసింది. ఒకరకంగా టిడిపి ఎమ్మెల్యే కార్యక్రమాలకు జనసేన నేతలను వెళ్లడానికి హెచ్చరించినట్టేనని ఆ మీటింగ్‌లో పాల్గొన్న వారి అభిప్రాయం. గోదావరి మహా పుష్కరాలు జరగబోతున్న టైంలో రాజమండ్రిలో కూటమి మధ్య సమన్వయం అత్యంత కీలకంగా మారింది. అన్ని ప్రాజెక్ట్‌లు సమన్వయంతో పూర్తయ్యాయి, పుష్కరాల ఏర్పాట్లు అద్భుతంగా జరగాల్సిన టైంలో… ఇలాంటి విభేదాలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారతాయని అంటున్నారు. ఇదే సమయంలో రాజమండ్రి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చుట్టూ సమీకృతమవుతుండగా, మంత్రి దుర్గేష్ ఒంటరి అవుతున్నారనే వాదన బలపడుతోంది. ఇరు పార్టీలష్ఠానాలు జోక్యం చేసుకుంటే తప్ప… ఈ విభేదాలకు తెరపడే అవకాశం లేదని రాజకీయ వర్గాలకు.

