పవన్ కళ్యాణ్ గోదావరి పుష్కరాలు ప్లాన్: ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మన గోదావరి పుష్కరాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజమండ్రి లో జరిగే ఈ పుష్కరాలకు దేశం నలుమూలల నుండి మాత్రమే కాదు, ఇతర దేశాల నుండి కూడా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆర్చరించి వెళ్తారు. ఇక్కడ స్నానం ఆచరిస్తే , ఎన్నో ఏళ్ళ నుండి మూటగట్టుకున్న పాపపు కర్మలన్నీ తొలగిపోతాయని, బలమైన విశ్వాసం భక్తుల్లో ఉంటుంది. ప్రతీ 12 ఏళ్లకు అత్యంత వైభోగంగా జరిగే ఈ పుష్కరాలు వచ్చే ఏడాది గ్రాండ్ గా జరగబోతున్నాయి. ప్రభుత్వానికి ఈ పుష్కరాలను సమర్థవతంగా నిర్వహించడం ఇప్పుడు పెద్ద సవాల్. అయితే ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏడాది లో జరగబోయే పుష్కరాలకు , ఇప్పటి నుండే పటిష్టమైన ఏర్పాట్లు చేయడానికి సిద్దమయ్యాడు, అందుకోసం నేడు ఆయన రాజమండ్రి లో గడపడం, అక్కడి పరిస్థితులను సమీక్షించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ముఖ్యంగా గోదావరి నదులు కలుషితం అవ్వడం పై పవన్ కళ్యాణ్ చాలా కష్టమైన జాగ్రత్తలు రాబోయే రోజుల్లో తీసుకోబోతున్నాడు. అందుకోసం రాబోయే రోజుల్లో కాలుష్య నివారణ శుద్ధి ప్లాంట్లను నిర్వహించాలని అధికారులను పరీక్షించాడు పవన్ కళ్యాణ్. మూడు నెలలకు ఒకసారి కాలుష్య నియంత్రణ మండలి ఆడిట్ బాధ్యతలు నిర్వహించబడుతున్నాయి, పుష్కరాల నిర్వహణలో పారిశ్రామికవేత్తలు సామాజిక తో వ్యవహరించి చొరవ చూపడం, వాళ్ళను మన ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది పెట్టడం లేదు కాబట్టి , వాళ్ళు సంపూర్ణంగా మాకు సహకరించాలని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పారు. అంతే కాకుండా, అధికారులతో టెస్ట్ కూడా చేయించాడు. గోదావరి పుష్కరాలు కేవలం ఒక్క రాజమండ్రి కి మాత్రమే పరిమితం కాకూడదని, ప్రతీ గోదావరి గట్టు ని ఉపయోగించుకోవాలని, అందుకు తగ్గ ప్రణాళిక రూపొందించి, బ్లూ ప్రింట్ ని కేంద్రానికి పంపిస్తే నిధులు ఇస్తామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.
పుష్కరాలు విజయవంతం అవ్వడానికి ప్రతీ ఒక్కరు కలిసి రావాలని , వచ్చే ఏడాది జరగబోయే ఈ పుష్కరాలు దేశ ప్రజల జీవితాంతం గుర్తించుకునేలా నిర్వహించాలని, కేవలం ప్రణాళికలు పేపర్ కి మాత్రమే పరిమితం కాకూడదని , ప్రతీ నెలలో నేనే నెలకు మూడు సార్లు విచ్చేసి ఏర్పాట్లను నిశితంగా పరిశీలిస్తానని , 6 నెలల్లో నా కళ్ళ ముందు కనపడాలని ఈ సందర్భంగా అధికారులను పరిశీలించారు పవన్ కళ్యాణ్. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ రాజముండ్రి పర్యటనకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు కనిపిస్తున్నాయి.

