పెద్ది హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్: మన టాలీవుడ్ నుండి స్టార్ హీరోలుగా ఎదిగిన వారిలో బాలీవుడ్ ఆడియన్స్ కి మొదటి నుండి పరిచయం ఉన్న హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ప్రభాస్, అల్లు అర్జున్ కంటే ముందే , రామ్ చరణ్ కి నార్త్ ఇండియా లో క్రేజ్ ఏర్పడింది. ఎందుకంటే ‘మగధీర’ హిందీ ఆడియన్స్ ఎగబడి చూశారు కాబట్టి. ఆ చిత్రం అక్కడ థియేటర్లలో విడుదల కాకపోయినప్పటికీ, టీవీ టెలికాస్ట్ ద్వారా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఆ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ తో అప్పట్లో రామ్ చరణ్ ‘జంజీర్’ హిందీలో రీమేక్ చేశాడు . భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. అయినా కూడా ఆరోజుల్లోనే హిందీలో ఈ చిత్రం 30 కోట్ల రూపాయల రేంజ్ లో నెట్ వసూళ్లు వచ్చాయి.
ఆ తర్వాత రామ్ చరణ్ డైరెక్ట్ గా ఎలాంటి హిందీ సినిమాల్లో నటించలేదు కానీ , #RRR చిత్రం ద్వారా ఆయన నార్త్ ఇండియాలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ చేసిన ‘గేమ్ చెంజర్’ భారీ అంచనాల నడుమ హిందీలో విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది, అయినా కూడా 30 కోట్ల రూపాయల రేంజ్ లో నెట్ వసూళ్లు వచ్చాయి. అయితే రామ్ చరణ్ లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ నార్త్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అలా అనిపించడం లేదు . పెద్ది చిత్రం ‘గేమ్ చేంజర్’ కంటే తక్కువ ఓపెనింగ్ ని సొంతం చేసుకుంటుందేమో అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఆ చిత్రం కేవలం 36 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయని , దీనివల్ల 76 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు మాత్రమే వస్తున్నాయని అంటున్నారు. అందుకు కారణం నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టకపోవడం వల్లే అని తెలుస్తుంది. అసలు ఆ థియేటర్లో విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. ఓజీ నెట్ కూడా ఇలాగే చేశారు , ఫలితంగా ఆ సినిమాకు క్లోజింగ్ లో కేవలం 5 కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే వచ్చాయి. నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టకపోతే ఓజీ రేంజ్ వసూళ్లే ఈ చిత్రం హిందీలో వస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

