Peddi Movie Censor Cuts: సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా డైరెక్టర్ బుచ్చి బాబు నే కనిపిస్తున్నాడు. ఆయన దర్శకత్వం లో , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం వచ్చే నెల 4న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రొమోషన్స్ లో భాగంగా బుచ్చి బాబు కనిపించిన ప్రతీ ఛానల్ కి వరుసపెట్టి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన అనుభవాలను పంచుకుంటూ , ఆయన మాట్లాడిన మాటలు సినిమాపై మరింత అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలు చూసిన తర్వాత అర్థం అయ్యింది , బుచ్చి బాబు మంచి విజన్ ఉన్న డైరెక్టర్ అని , ఆయన విజన్ కి తగ్గ ఔట్పుట్ వచ్చేంత వరకు టెక్నీషియన్స్ నుండి ఎన్ని రీ టేకులు అయినా తీసుకుంటారని చెప్పారు.
AR రెహమాన్ లాంటి లెజెండ్ తోనే , నాకు ఈ ట్యూన్ నచ్చలేదు అని చెప్పి, ఆయన తన విజన్ కి తగ్గ బెస్ట్ ట్యూన్ ఇచ్చేంత వరకు వదలలేదు అంటే, బుచ్చి బాబు అవుట్ పుట్ విషయం లో ఎంత కచ్చితమైన మనస్తత్వం తో ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. కాదు , ఫైనల్ ఔట్పుట్ విషయం లో కూడా అసలు తగ్గేదేలే అనే మోడ్ లోనే ఉన్నాడు బుచ్చి బాబు. రీసెంట్ గానే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫైనల్ ఎడిట్ వెర్షన్ పూర్తి అయ్యాక 3 గంటల 10 నిమిషాల నిడివి వచ్చిందట. అయితే సెన్సార్ సభ్యులు కట్స్ బాగానే సూచించారట. అందుకు బుచ్చి కాస్త అసహనం కి గురైనట్టు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సినిమాలో , ఆయా సందర్భాల్లో ఇవి అత్యంత కీలకమైనవి అట, అందుకే చాలా వరకు సెన్సార్ సభ్యులను రిక్వెస్ట్ చేసాడట , కానీ వాళ్ళు ఒప్పుకోవడం తో కట్స్ కి అంగీకరించాల్సి వచ్చింది బుచ్చి బాబు.
దాదాపుగా 10 నిమిషాల సన్నివేశాలను సినిమా నుండి తొలగించారట. ఇప్పుడు మూడు గంటల సినిమాగా మిగిలింది , చూడాలి మరి ఈ 10 నిమిషాలు తొలగించడం వల్ల , సినిమాపై ఎలాంటి ప్రభావం పడనుంది. ఇకపోతే ఈ ట్రైలర్‌కు సంబంధించిన థియేట్రికల్ ని రేపు ముంబై లో గ్రాండ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు , ఈ థియేట్రికల్ ట్రైలర్ తర్వాత ప్రీ సేల్స్ భారీగా పెరుగుతాయనే ఆశతో ఫ్యాన్స్. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

