భారీ బడ్జెట్ తో ప్రదర్శించిన ఈ సినిమా థియేటర్స్ లో నిన్న రాత్రి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. (పెద్ది OTT)
పెద్ది OTT
Peddi OTT : రామ్ చరణ్ పెద్ది సినిమా నేడు థియేటర్స్ లో రిలీజైంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో నిన్న రాత్రి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. థియేటర్లు చాన్నాళ్ల తర్వాత కళకళలాడుతున్నాయి. ఇక చరణ్ పర్ఫార్మెన్స్ ని అందరూ పొగుడుతున్నారు. సెకండ్ హాఫ్ అయితే ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
పెద్ది సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో నడుస్తుంది. ఇటీవల ముందే ఒప్పందాలు చేస్తున్నారు థియేటర్లలో సినిమాతో పాటే ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్ ని కూడా అనౌన్స్ చేస్తున్నారు. పెద్ది సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనున్నట్టు తెలిసింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ పెద్ద సినిమా దాదాపు 130 కోట్లకు కొనుక్కున్నట్టు సమాచారం.
ఇది కూడా చదవండి: రామ్ చరణ్ : ఇన్నాళ్లు తమిళ్ హీరోలని పొగిడారు.. ఇప్పుడు చరణ్ ని పొగుడుతారా? మన స్టార్ హీరోలకు ఆ దమ్ముందా?
థియేటర్లు బాగుపడాలంటే ఓటీటీలో పెద్ద సినిమాలు 8 వారాల తర్వాత రిలీజ్ అవ్వాలని అందరూ అంటున్నా ఓటీటీ ఒప్పందాలతో ముందే వస్తున్నాయి. ఇటీవల ఎంత పెద్ద సినిమా అయినా, హిట్ సినిమా అయినా 4 వారాలకే ఓటీటీలోకి వస్తుంది. ఈ లెక్కన పెద్ది సినిమా జులై మొదటి వారంలో నెట్ ఫ్లిక్స్ ఓటీలోకి వచ్చే అవకాశం ఉంది.

