పెద్ది ట్రైలర్ స్టోరీ రివీల్: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ ని కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ట్రైలర్ లోనే సినిమా కథ మొత్తం చెప్పేశారు… విజయనగరం పక్కన ఉండే ఒక చిన్న గ్రామంలో ‘పెద్దిరాజు’ అనే ఒక కూలీ పని చేసుకునే యువకుడు ఉంటాడు. అతను క్రికెట్ లోనూ కుస్తీ పోటీల్లోనూ రన్నింగ్ రేస్ లోనూ నెంబర్ వన్ పొజిషన్లో ఉంటాడు. అందుకే ఆ ఊరు మొత్తం అతన్ని ఇష్టపడుతూ ఉంటారు.
ఇక ఈ కోరికనే ఆ ఊరికి ఒక పెద్ద కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని తొలగించడానికి పెద్ది తనకు తెలిసిన క్రికెట్, కుస్తీ, రన్నింగ్ రేస్ లను ఎలా వాడుకున్నాడు…దాని కోసం పెద్ది ఏం కోల్పోయాడు. అలాగే ఆ గ్రామాన్ని ఎలా కాపాడుకున్నాడు తన ప్రాంతాన్ని ఇతరులకు ఎలా అడ్డుకున్నాడు. అనేది ఈ సినిమా కథగా తెలుస్తుంది.
అయితే పోటీలు అనేవి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ మనిషి బతకడానికి నేల కావాలి అంటే ఒక క్యారెక్టర్ లో శివరాజ్ కుమార్ కనిపించాడు. ఇక అతని ఆశ ముందుకు తీసుకెళ్లడానికే పెద్దియాన్ని కృషి చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది శివరాజ్ కుమార్ నుంచి మొదలైన కథ ఫైనల్ గా పెద్దితో ముగుస్తుంది… మొత్తానికైతే ఈ సినిమా కథ ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో మీర్జాపూర్ ఫేమ్ దివ్యందు శర్మ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది.
ఇక క్యారెక్టర్ చరణ్ ని అడ్డుకునే పాత్ర కూడా ఇదే కావడం విశేషం…ఇక ట్రైలర్ లో అన్ని చెప్పే ప్రయత్నం చేసారు కానీ ఏది పెర్ఫెక్ట్ గా డెలివరీ కానట్టుగానే అనిపిస్తుంది. ఇక రామ్ చరణ్ మాత్రం క్రికెటర్ గా, కుస్తీ ఫైటర్ గా, రన్నింగ్ రేసర్ గా అదిరగొట్టినట్టుగా అనిపిస్తుంది…

