తరగతి గది
ప్రచురించబడింది: మంగళవారం, జూలై 21, 2026, 19:30 (IST)
రైతులకు ఆర్థిక సాయం. ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. అంటే సంవత్సరానికి రూ.6 వేలు అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు 23 విడతలుగా పీఎం కిసాన్ నిధులు వచ్చాయి. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.46 వేలు జమ అయ్యాయి. పీఎం కిసాన్ పథకంలో భాగంగా డబ్బులు ఖాతాల్లో జమ కావాలంటే తప్పనిసరిగా ఇకవైసీ చేసుకోవాలి. ఇకవైసీ చేస్తేనే అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు తేల్చి చెప్పారు.
ఇప్పటికి కూడా ఇకవైసీ చేసుకోని వారికి డబ్బులు జమ కాలేదు. రైతులు చాలా సులభంగా ఇకవైసీ చేసుకోవచ్చు. మీసేవ కేంద్రాలు, సీఎస్సీలు, పీఎం కిసాన్ మొబైల్ యాప్ లో ఇకవైసీ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ ద్వారా ఇకవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ 23వ విడత నిధులు గత నెలలో అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి. 24 వ విడతకు సంబంధించి సెప్టెంబర్ లో అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అయితే పీఎం కిసాన్ పథకం తీసుకొచ్చి 7 సంవత్సరాలు పూర్తయింది. అయినా పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6 వేలను పెంచడం లేదు.
గత బడ్జెట్ సమయంలో పీఎం కిసాన్ పథకం కింద అందించే రూ.6 వేలు రూ.9 వేలు పెంచుతారని వార్తలు వచ్చాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వచ్చే బడ్జెట్ లో ఉన్న పీఎం కిసాన్ నిధులను రూ.6 వేల నుంచి రూ.9 వేలకు పెంచాలని రైతులు కోరుతున్నారు. కాగా.. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు, ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినవారు, ఆదాయపు పన్ను కట్టేవారు పీఎం కిసాన్ పథకానికి అనర్హులు. ఒక వేళ వారు పీఎం కిసాన్ తీసుకుంటే స్వచ్ఛందంగా వెనక్కు ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.
ఇక రాష్ట్రం కూడా రైతులకు ఆర్థిక సాయం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. ఈ పథకం కింద సంవత్సరానికి రూ.12 వేలు అందిస్తోంది. సీజన్ కు రూ.6 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈసారి వర్షాకాల సీజన్ కు సంబంధించి రైతు ఖాతాల్లో రూ.6 వేల చొప్పున జమ చేశారు. ఈ రోజుల్లో దాదాపు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. అయితే గత యాసంగి సీజన్ కు సంబంధించి కేవలం రెండు ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చారు.
-
8 గంటలు బ్లాక్ చేయండి
-
12 గంటల పాటు బ్లాక్ చేయండి
-
24 గంటలు బ్లాక్ చేయండి
-
అడ్డుకోవద్దు




దాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్లను అన్‌బ్లాక్ చేయండి