20000 లోపు ఉత్తమ స్మార్ట్ఫోన్లు : ప్రస్తుత కాలంలో మొబైల్ ధరలు లక్ష రూపాయలకు పైగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు కొందరు బడ్జెట్ లో మొబైల్ కొనాలని చూసేవారు లేకపోలేదు. రోజూవారీ వినియోగంతో పాటు కాస్త రగ్గడ్ గా ఉపయోగించేవారు తక్కువ ధరలోనే ఫోన్ కొనాలని అనుకుంటారు. అలాంటి వారికి 2026లో రూ. 20,000 బడ్జెట్లో మంచి స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇవి తక్కువ ధరలు ఉన్నప్పటికీ అద్భుతమైన AMOLED డిస్క్ప్లేలు, హై రిఫ్రెష్ రేట్, పవర్ఫుల్ ప్రాసెసర్లు, పెద్ద బ్యాటరీల వంటి ప్రీమియం ఫీచర్లను కంపెనీలు అందిస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్ 4 స్మార్ట్ఫోన్ల పూర్తి వివరాలు ఇవే..
Poco M8
పోకో బ్రాండ్ నుంచి వచ్చిన Poko M8 బడ్జెట్ ధరలో అద్భుతమైన డిస్ప్లే, పనితీరును అందిస్తోంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇచ్చే 6.77 పూర్తి HD ప్లస్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. వాటిని అమర్చిన Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ రోజువారీ పనులను చాలా స్మూత్‌గా రన్ చేస్తుంది. కెమెరా విషయానికి వస్తే, ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్‌తో పాటు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 20MP ఫ్రంట్ కెమెరాను అందించారు. దీని ధర రూ. 14,999 గా ఉంది.
రియల్మే నార్జో 90
భారీ బ్యాటరీ, సూపర్ సెల్ఫీ కెమెరా కోరుకునే వారికి రియల్ మీ నాజ్రో 90 ఒక బెస్ట్ ఆప్షన్. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.57 పూర్తి HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ ప్రాసెసర్ ఉపయోగించారు. ఇందులో ఏకంగా 50MP సెల్ఫీ కెమెరాను అందించారు. వెనుక వైపు 50MP ప్రైమరీ, 2MP మోనోక్రోమ్ కెమెరాలు ఉన్నాయి. అదనంగా, 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే భారీ 7,000mAh బ్యాటరీ దీని సొంతం. దీనిని రూ. 17,999తో కొనుగోలు చేయొచ్చు.
Moto G37 పవర్
మోటొరోలా నుంచి మొబైల్స్ కొనాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చిన మోడల్ Moto G37 Power. ఈ ఫోన్లో 6.7 HD ప్లస్ LCD డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 6400 చిప్సెట్తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ రోజువారీ సాధారణ వినియోగానికి చాలా చక్కగా సరిపోతుంది మరియు మీరు నార్మల్ గేమింగ్ కూడా సులువుగా ఆడుకోవచ్చు. క్లీన్ సాఫ్ట్వేర్ అనుభవాన్ని ఆశించేవారికి ఇది మంచి ఎంపిక. రూ. 12,999 తో ఈ మొబైల్ కొనుగోలు చేయొచ్చు.
Samsung Galaxy M36
శాంసంగ్ అంటే చాలా మందికి నమ్మకమైన బ్రాండ్. ఈ కంపెనీ నుంచి Samsung Galaxy M36 ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.55 ఫుల్ హెచ్ డీ ప్లస్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది పవర్ఫుల్ Samsung Exynos 1380 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. విషయానికొస్తే.. ఇందులో వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా ఉంచారు. 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ అనే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 13MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ధర దాదాపు రూ. 18,999 గా ఉంది.
బెస్ట్ డిస్ప్లే, పర్ఫార్మెన్స్ కావాలంటే Poco M8, భారీ బ్యాటరీ మరియు అదిరిపోయే సెల్ఫీ కావాలంటే Realme Narzo 90, తక్కువ బడ్జెట్లో కావాలంటే Moto G37 Power, అలాగే నమ్మకమైన బ్రాండ్ మరియు మంచి కెమెరా సెటప్ కోసం Samsung Galaxy M36 ఫోన్లు మీ అవసరాలకు తగ్గట్టుగా ఎంచుకోవచ్చు.

