ఇప్పుడు పూజాహెగ్డే విజయ్ జన నాయకన్ సినిమాతో రాబోతుంది. (పూజా హెగ్డే)
పూజా హెగ్డే
పూజా హెగ్డే : ఒకప్పుడు వరుసగా హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ అయింది పూజాహెగ్డే. కానీ గత కొన్నాళ్లుగా వరుస ఫ్లాప్స్ చూస్తుంది. అంతే కాకుండా చేతిలో సినిమాలు కూడా ఎక్కువగా లేవు. దీంతో పాపం పూజాహెగ్డే అని అనుకుంటున్నారు అంతా. 2022 నుంచి పూజాహెగ్డే హిందీ, తమిళ్ లో 6 సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు.
ఇప్పుడు పూజాహెగ్డే విజయ్ జన నాయకన్ సినిమాతో రాబోతుంది. ఈ సినిమా అయినా పూజాహెగ్డేకి హిట్ ఇచ్చి మళ్ళీ ఆమె కెరీర్ ని ఫుల్ ఫామ్ లో పెడుతుంది అని అనుకుంటుంది. అయితే ఇది విజయ్ చివరి సినిమా కావడం, విజయ్ సీఎం అయ్యాక రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో విజయ్ జన నాయకన్ అన్నట్టే ప్రమోట్ అవుతుంది. అసలు పూజాహెగ్డే గురించి ఎవరూ మాట్లాడుకోలేదు. ఈ సినిమా ఎలా ఉన్నా విజయ్ లాస్ట్ సినిమా కాబట్టి హిట్ అవుతుంది. కానీ హిట్ క్రెడిట్ లో ఒక్క శాతం కూడా పూజాహెగ్డేకు వచ్చేలా కనిపించట్లేదు.
ఇవి కూడా చూడండి: గాయత్రి సింహాద్రి : పెద్ది లుక్స్‌లో అదరగొడుతున్న కార్తీక దీపం విలన్.. గాయత్రి సింహాద్రి ఫొటోలు..
ఇదంతా ఒక ఎత్తు అయితే జన నాయకన్ దర్శకుడు వినోద్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పూజాహెగ్డే గురించి చెప్పిన కామెంట్స్ తో ఆమెకు నిరాశ తప్పేలా లేదని తెలుస్తుంది.
వినోద్ మాట్లాడుతూ.. పూజా హెగ్డే ఈ సినిమాలో జర్నలిస్టు పాత్ర పోషించింది. ఆ పాత్రకు మొదట చాలా సీన్లు రాసుకున్నాను. కానీ సినిమా నిడివిని దృష్టిలో పెట్టుకొని అందులో కొన్ని సీన్స్ షూటింగ్ చేయలేదు. సినిమా అయ్యాక ఎడిటింగ్ లో కూడా ఆమె సీన్స్ కొన్ని కట్ చేయాల్సి వచ్చింది అని తెలిపాడు. దీంతో జన నాయకన్ సినిమాలో పూజాహెగ్డే కాపే కనిపిస్తుందని, ఆ కనిపించే సీన్స్ కూడా అంత ఇంపాక్ట్ చూపించేవి కాదని తెలుస్తుంది. దీంతో విజయ్ సినిమా హిట్ తో తాను కూడా ఫేమ్ లోకి రావాలనుకున్న పూజాహెగ్డేకు నిరాశ తప్పేలా ఉందని. మరి జన నాయకన్ సినిమా పూజాహెగ్డే కెరీర్ ని ఎలా మారుస్తుందో చూడాలి.


