ప్రభాస్ క్రికెట్ వీడియో: ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు ఆయన సమాంతరంగా ‘ఫౌజీ’, ‘కల్కి 2’ చిత్రాల షూటింగ్లలో కూడా పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా, ఆయన హీరోగా నటించిన ‘రాజా సాబ్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత ఆయన ‘ఫౌజీ’ తో భారీ కం బ్యాక్ చూస్తున్నాడు. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో కానీ , వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా కానీ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ షూటింగ్ సెట్స్ లో ఎంత సరదాగా ఉంటాడో చెప్పడానికి రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది.
ఇది సలార్ మూవీ షూటింగ్ సమయానికి సంబంధించిన వీడియో. ఈ వీడియో లో సలార్ టీం సరదాగా క్రికెట్ ఆడుతుండడం మనం చూడొచ్చు. హీరోయిన్ శృతి హాసన్ బ్యాటింగ్ చేస్తుండగా , ప్రభాస్ బౌలింగ్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్ర దర్శకుడిగా వ్యవహరించిన ప్రశాంత్ నీల్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. ‘సలార్’ చిత్రంలో ప్రభాస్ చిన్న పిల్లలతో కలిసి క్రికెట్ ఆడే సన్నివేశం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సన్నివేశం సమయం లో షాట్ మధ్యలో వచ్చిన బ్రేక్ లో , ఇలా మూవీ టీం మొత్తం కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్న ఈ వీడియోని మీకోసం క్రింద అందించాము చూడండి. ఇలాంటి అద్భుతమైన జ్ఞాపాకాలు సలార్ మూవీ షూటింగ్ సమయం లో చాలానే ఉన్నాయట.
సాలార్2 సెట్స్ లో క్రికెట్ ఆడుతున్న #శృతిహాసన్ మరియు #ప్రశాంత్ నీల్
ప్రభాస్ అన్న బౌలింగ్ వేస్తున్నాడు pic.twitter.com/JqtO8Obw83
— $ (@VamshiPrabhas23) జూన్ 10, 2026

