Quirpon Island Mystery: విశాలంగా సముద్రం.. అంతకు మించిన స్వచ్ఛమైన తీరం.. కొండలు.. వాటిని ఆనుకొని ఉన్న వృక్షాలు.. చదువుతుంటే ఆ ప్రాంతం వద్దకు వెళ్లాలి అనిపిస్తోంది కదూ.. అక్కడ హాయిగా సేదతీరి.. ఆనందంగా ఆ ప్రాంతాన్ని తనివి తీరా చూడాలంటే.. ఇంకో యాంగిల్ మాత్రమే అవి చూపించే చుక్కలు కూడా ఉంటాయి.
కెనడా దేశంలోని అట్లాంటిక్ మహాసముద్రంలో న్యూ ఫౌండ్ ల్యాండ్ అనే తీరం ఉంటుంది. దానికి అవతలి భాగంలో క్విర్పాన్ ఐలాండ్ అనే దీవి ఉంటుంది. ఈ దీవిలోకి మొన్నటి వరకు ఎవరు వెళ్లేవారు కాదు. దీని వెనక వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ దీవికి దయ్యాల పేరు రావడానికి ఒక కారణం ఉంది. సరిగ్గా 16వ శతాబ్దంలో ఫ్రెంచ్ నావికుడు కెప్టెన్ ఫ్రాంక్ యిస్ 1542లో తన సైనికులతో కలిసి నౌక యాత్రకు వెళ్లిపోయాడు. ఆ నౌకలో ఫ్రాంకోయిస్ బంధువు మార్గరెట్ కూడా ఉంది. అయితే ఆమె మీద ఫ్రాంకోయిస్ కు ప్రేమ ఉండేది. అతడి ప్రేమ ఆమెకు నచ్చేది కాదు.
ఈ నౌకలో ప్రయాణిస్తున్నప్పుడే ఆమె ఆ సైన్యంలో పనిచేసే ఒక యువ సైనికుడు మీద ప్రేమ పెంచుకుంది. అది కాస్త శారీరక సంబంధానికి దారి తీసింది. తనను కాదని ఒక సైనికుడిని ఆమె ప్రేమించడం.. శారీరకంగా సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం.. ఫ్రాంకోయిస్ కు ఏమాత్రం నచ్చలేదు. తాను నచ్చిన అమ్మాయిని అతడు ప్రేమించడం.. వశం చేసుకోవడం అతడు తట్టుకోలేకపోయాడు. అంతే వారిద్దరిని ఈ దీవిలో పడేసి వెళ్లిపోయాడు.
ఎటు వెళ్లాలో తెలియక.. బతికి బట్ట కట్టే మార్గం అర్థం కాక వారిద్దరు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. బయటికి వచ్చే ప్రయత్నం చేయడానికి ఆకలికి తట్టుకోలేక చనిపోయారు. అప్పటినుంచి వారిద్దరి ఆత్మలు అక్కడ సంచరించేవి. ఆ ప్రాంతంలోకి వెళ్లే వారిని తీవ్రంగా హింసించేవి. కొన్ని సందర్భాల్లో క్రూరంగా చంపేసేవి. రాత్రి సమయాల్లో వింత శబ్దాలు.. వింత వింత మాటలు.. వింత ఆకారంలో ఉన్న జంతువులు కనిపించేవని అక్కడివారు చర్చించుకుంటారు. అయితే ఇటీవల కాలంలో ఈ ప్రాంతాన్ని కొందరు సందర్శిస్తున్నారు. అయితే పగటిపూట మాత్రమే వారు పూర్తి చేస్తున్నారు. రాత్రిపూట ఉండడానికి ఇష్టపడటం లేదు. అకస్మాత్తుగా ఇక్కడ గాలులు రావడం.. సముద్రపు అలలు పొంగడం.. వింత వింత శబ్దాలు వినిపించడం.. చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఔత్సాహికులు కూడా పగటిపూట వరకు తమ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం అక్కడ ఆత్మలు లేవని.. దయ్యాలు కూడా లేవని వాదిస్తున్నారు. ప్రత్యక్షంగా ఆ ఎదుర్కొన్న వారు మాత్రం మరోసారి ఆ అనుభూతి వెళ్లడానికి ఇష్టపడడం లేదు.

