రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ: కొరియోగ్రాఫేర్, హీరో , గా తెలుగు , తమిళ భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని ఏర్పాటు చేసుకున్న రాఘవ లారెన్స్ కి మొదటి నుండి సేవ చేయాలనే తత్త్వం మనమంతా చూస్తూనే ఉన్నాం. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ స్ఫూర్తితో ఆయన సంపాదించిన దాంట్లో ఎంతో కొంత వికలాంగులకు , అనాధలకు దానం చేస్తుంటాడు. ఇలాంటి గొప్ప మనసు ఉన్నవాడికి దేవుడు కచ్చితంగా మంచి చెయ్యాలని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కూడా కోరుకుంటూ ఉంటారు. అలా మంచి చేయడం వల్లనే ఏమో , లారెన్స్ కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని స్థాయిలో ఉన్నాడు. అయితే లారెన్స్ మనస్తత్వం , మంచితనాన్ని చూసి , ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడని అంతా అనుకున్నారు. ఈ కుళ్ళు రాజకీయాల్లోకి అడుగుపెడితే , స్వచ్ఛమైన మనస్సు ఉన్నటువంటి లారెన్స్ లాంటోళ్ళు కూడా కలుషితం అయిపోతారు అనేది విశ్లేషకుల.
కానీ ఆయన అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ , రాజకీయ అరంగేట్రం చేయబోతున్నట్టు కాసేపటి క్రితమే సోషల్ మీడియా ద్వారా ఒక 18 నిమిషాల నిడివి ఉన్న వీడియోతో అధికారిక ప్రకటన చేశాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి సిద్ధపడ్డారు. నేను ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలని కోరుకోలేదు , కానీ పరిస్థితులు నన్ను రాజకీయ అరంగేట్రం చేసేలా చేస్తున్నాను, కొన్ని మంచి పనులు చేయాలంటే రాజకీయాలు ఒక్కటే మార్గం అంటూ చెప్పుకొచ్చాడు లారెన్స్. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూడండి. అయితే ఆయన ఏ పార్టీ లో చేరబోతున్నాడు అనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ , తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానం నుండి పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు.
లారెన్స్ మాట తీరు చూస్తుంటే , విజయ్ TVK పార్టీ నుండే పోటీ చేయబోతున్నాడని తెలుస్తోంది. తమిళనాడు మీడియా కూడా లారెన్స్ TVK నుండే తిరుచ్చి స్థానం నుండి పోటీ చేయబోతున్నాడని అంటోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలపనున్నాడు లారెన్స్. లేకపోతే ప్రస్తుతం ఆయన ‘బెంజ్’, ‘కాంచన 4’ వంటి చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు. బెంజ్ చిత్రం లోకేష్ కనకరాజ్ శిష్యుడు బక్కియా రాజ్ కణ్ణన్ దర్శకత్వం వహించగా , ‘కాంచన 4’ చిత్రం తన స్వీయ దర్శకత్వం లోనే తెరకెక్కింది. ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి, కేవలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. రాజకీయాల్లోకి వచ్చే ముందు సినిమా కమిట్మెంట్స్ ని క్లియర్ చేసుకున్నాడు. మరి భవిష్యత్తులో సినిమాలు చేస్తాడో లేదో చూడాలి.
ప్రతిఫలం ఆశించకుండా నీ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించు.
ఈ వీడియో చూసిన తర్వాత, దయచేసి మీ సలహాలు మరియు సూచనలను వ్యాఖ్యలలో పంచుకోండి. మీరు “వద్దు” అని చెబితే నేను రాజకీయాల్లోకి రాను మరియు సమాజానికి నా నిస్వార్థ సేవను కొనసాగిస్తాను. కానీ మీరు “అవును” అని చెబితే, నేను ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాను… pic.twitter.com/VwPFjdaUqy
— రాఘవ లారెన్స్ (@offl_Lawrence) జూన్ 12, 2026

