Rajinikanth New Movie Heroine: అదృష్టం అంటే ఇదేనేమో.. ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటూ పాపులరిటీ ని సంపాదించిన శ్రీదేవి , ఏకంగా నేచురల్ స్టార్ నాని దృష్టిలో పడేయడం , ఆయన నిర్మాతగా నటించిన ‘కోర్ట్’ చిత్రం లో ఆమెని హీరోయిన్ గా తీసుకోవడం , అది విడుదలై సంచలన విజయం సాధించడం శ్రీదేవి కి జాక్ పాట్ అనే చెప్పాలి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో , ఆమెకు అవకాశాలు క్యూలు కట్టాయి. అలా శ్రీదేవి నుండి విడుదలైన రెండవ చిత్రం ‘బ్యాండ్ మేళం’ కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆమెకు ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. ఈ విషయాన్నీ ఆమె పరోక్షంగా చెప్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఒక స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
1991వ సంవత్సరం లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన తలపతి చిత్రం లో ఒక ఐకానిక్ ఫోజుని ఇమిటేట్ చేస్తూ స్టైల్ గా నిలబడి శ్రీదేవి ఒక ఫోటో దిగింది. దీన్ని నెటిజెన్స్ తావరలోనే కమల్ హాసన్ నిర్మాణంలో రజినీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమాలో శ్రీదేవి ఒక కీలక పాత్ర పోషించిందని, ఆ కారణం చేతనే ఆమె ఇలా పరోక్షంగా స్టోరీని అప్లోడ్ చేసిందని విశ్లేషకులు అంటున్నారు. ఈమధ్య కాలం లో హీరోయిన్స్ ఇలా క్రియేటివిటీ ని జోడించి పరోక్షంగా సూచనలు ఇస్తున్నారు. శ్రీదేవి కూడా అలాగే ఇచ్చిందని అంటున్నారు. మరి ఈ విషయం పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇప్పటికే శ్రీదేవి కోలీవుడ్ లో బాగా బిజీ అయ్యింది. కేజీఆర్ సరసన ఆమె ఒక చిత్రంలో నటిస్తోంది.
ఇంతలోపే ఈ క్రేజీ ఆఫర్ ఆమెకు దక్కడం ఆమె లైఫ్ లో సాధించిన పెద్ద అఛీవ్మెంట్ గా చెప్పొచ్చు. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ కి అయినా రజినీకాంత్ సినిమాలో చిన్న రోల్ దొరికితే చాలు అనుకుంటున్నారు. ఎందుకంటే రజినీకాంత్ కి ఇంటర్నేషనల్ మార్కెట్, విదేశాల్లో ఆయన సినిమాలను ఆడియన్స్ ఎగబడి చూస్తారు, అలాంటి సూపర్ స్టార్ సినిమాలో చిన్న క్యారెక్టర్ దొరికినా చాలు, ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ కి పరిచయం అవుతాము అనే ఉద్దేశ్యంతో , అలాంటి అవకాశం ఉంటుంది ఒక్కరు రజిని సినిమాలో నటించాలని కోరుకుంటారు , శ్రీదేవి కి కెరీర్ స్టార్ట్ లోనే రావడం విశేషం కాదు , ఆమె ఎంత వరకు ఉపయోగించుకుంటుందో చూడాలి.

