రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ : 2026 ఐపిఎల్ ప్రారంభంలో చెన్నై, రాజస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో రాజస్థాన్ విజయం సాధించింది. ఆ విజయాన్ని రాజస్థాన్ ప్లేయర్లు ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నారు. వారందరి కంటే ఎక్కువగా సంతోష పడింది రవీంద్ర జడేజా. నిజంగా అతడు ఆ స్థాయిలో సంబరాలు జరుపుకుంటాడని.. ఉత్సాహాన్ని చూపిస్తాడని అభిమానులు కలలో కూడా ఊహించలేదు.
ఐపీఎల్లో చెన్నై జట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ చెన్నై జట్టులో రవీంద్ర జడేజా కూడా అంతే స్థాయిలో ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి రవీంద్ర జడేజా 2026 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ జట్టుకు వెళ్లిపోతాడని.. అతడి స్థానంలో సంజు శాంసన్ వస్తాడని ఎవరూ ఊహించలేదు. కనీసం కలలో కూడా అంచనా వేయలేదు. రవీంద్ర జడేజా రాజస్థాన్ జట్టు తరుపున మెరుగైన ప్రదర్శన చేశాడు. దానికంటే ముందు చెన్నై జట్టు తరుపున ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. అటువంటి రవీంద్ర జడేజాను మేనేజ్మెంట్ ఎందుకు పక్కన పెట్టింది అనేది ఇప్పటికి క్లారిటీ లేదు.
నాడు చెన్నై జట్టు తనను రాజస్థాన్ జట్టుకు పంపించే చివరి నిమిషం వరకు చెప్పలేదని రవీంద్ర జడేజా తెలిపాడు. ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా చేసిన వ్యాఖ్యలు కంట నీరు తెప్పిస్తున్నాయి. ఎందుకంటే చెన్నై జట్టుతో అతడికి బలమైన సంబంధం ఉంది. ధోనితో సోదరుడి కంటే ఎక్కువ అనుబంధం ఉంది. ఇన్ని ప్రస్తుతం చెన్నై మేనేజ్మెంట్ అతడిని పక్కన పెట్టడం.. రాజస్థాన్ జట్టుకు పంపించడం అతడికి నచ్చలేదు. చివరి నిమిషంలో చెప్పడంతో.. మేనేజ్మెంట్తో మాట్లాడేందుకు అతడు ప్రయత్నించాడు. మేనేజ్మెంట్ వినిపించుకోలేదు. మహేంద్ర సింగ్ ధోనీకి చెప్పాలని ఫోన్ చేశాడు. అతడి ఫోన్ కలవలేదు. దీంతో బాధాకరమైన హృదయంతోనే అతడు రాజస్థాన్ జట్టుకు వెళ్లిపోయాడు.
రాజస్థాన్ జట్టుకు వెళ్లిపోయిన తర్వాత కొద్ది రోజుల వరకు జడేజా ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే చెన్నై జట్టుతో అతడికి ఉన్న జ్ఞాపకాలు. కొద్దిరోజుల వరకు మనసులో కలత ఉంది. ఆ తర్వాత క్రమక్రమంగా కుదుటపడ్డాడు. రాజస్థాన్ జట్టుకు ట్యూన్ అయ్యాడు. ఐపీఎల్ అనేది కమర్షియల్ గేమ్. ఇందులో సెంటిమెంట్లకు అవకాశం లేదు. బలమైన బంధాలకు ఆస్కారం లేదు. కానీ కొంతమంది ప్లేయర్లు దీనిని కమర్షియల్ గా చూడరు. ఆటలాగానే చూస్తారు. అనుబంధాలు పెంచుకుంటారు. వాటిని తుంచేస్తే ఇదిగో ఇలానే బాధపడుతుంటారు. అచ్చం రవీంద్ర జడేజాలాగా.

