RCB vs GT IPL 2026 చివరి ప్రత్యక్ష ప్రసార నవీకరణలు: IPL 2026 అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఉత్కంఠభరితమైన పోరు జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు తలో ఒకసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాయి. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథిగా తన మొదటి టైటిల్ కొట్టాలని కసిగా ఉంటే, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా రెండు ట్రోఫీలు గెలిచిన మూడో కెప్టెన్‌గా రికార్డు సృష్టించాలని చూస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించిన మరిన్ని సమాచారం కోసం V6 తెలుగు న్యూస్ ఛానెల్ ని చూస్తునే ఉండండి..
RCB vs GT:
* టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఆర్సీబీ..
* మొదట బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి రానున్న గుజరాత్ టైటాన్స్
* అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ పోరు
* పాత జట్టుతోనే బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
* 200+ స్కోరు చేస్తే గెలవడం పక్కా: గత 18 ఏళ్ల చరిత్రలో ఏ ఐపీఎల్ ఫైనల్లోనూ 200+ స్కోరును ఛేజ్ చేయలేదు.. అంటే 200+ పరుగులు చేస్తే గెలవడం ఖాయం.. 2008 నుంచి 2025 వరకు ఎప్పుడూ జరిగిన ఫైనల్స్‌లో నాలుగు సార్లు 200+ స్కోర్లు నమోదయ్యాయి.
* తొలి క్వాలిఫయర్ గెలిచిన జట్టుదే ట్రోఫీ?: గత 8 ఫైనల్స్‌లోనూ క్వాలిఫయర్ 1లో గెలిచిన జట్టే విజయం సాధించింది. 2016 నుంచి అన్ని ఫైనల్స్ కూడా క్వాలిఫయర్ 1లో ఆడిన జట్ల మధ్యే పోటీ కొనసాగుతోంది. 2016లో మాత్రం హైదరాబాద్ ఎలిమినేటర్‌లో గెలిచి ఛాంపియన్‌గా అవతరించి చరిత్ర నెలకొల్పింది.
* కాసేపట్లో టాస్: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ కాసేపట్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. రాత్రి 7 గంటలకు టాస్ పడనుండగా, రాత్రి 7: 30 గంటలకు మ్యాచ్ ప్రారంభమైతుంది..
* ఫైనల్ పోరుకు సిద్ధం: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ కాసేపట్లో అహ్మదాబాద్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరగబోతుంది..

