RCB vs GT IPL ప్లేఆఫ్‌లు : ఐపీఎల్లో భాగంగా ధర్మశాలలో బెంగళూరు, గుజరాత్ జట్లు నేడు పోటీ పడుతున్నాయి. మరి కాసేపట్లో ఈ మ్యాచ్ జరుగుతుంది. రెండు జట్లలో సమవుజ్జీలైన ప్లేయర్లున్నారు. దీంతో పోటీ హోరాహోరీగా సాగే అవకాశం ఏర్పడింది. బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీ వీరోచితంగా ఆడుతున్నాడు. 37 ఏళ్ల వయసులోనూ అతడు దూకుడుకు పర్యాయపదంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ ప్లే ఆఫ్‌లో రెచ్చిపోతే తమకు తిరుగుండదని బెంగళూరు మేనేజ్మెంట్ అనుకుంటున్నారు.
విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటగాడైనప్పటికీ ప్లే ఆఫ్ ముందు అతని ఆట గురించి బెంగళూరు యాజమాన్యం కలవరపడుతోంది. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 14 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేశాడు. ఇందులో విరాట్ కోహ్లీ 557 పరుగులు చేశాడు. అతడి యావరేజ్ 50.64, స్ట్రైక్ రేట్ 163.82 గా ఉంది. విరాట్ కోహ్లీ ఫామ్ పరంగా పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికి ప్లే ఆఫ్ సమరంలో అతని రికార్డులు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ సీజన్లో చివరి లీగ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ హైదరాబాద్ జట్టు పై కేవలం 15 మాత్రమే చేశాడు. బ్యాటింగ్ చేస్తున్నంత సేపు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు. దీనికి తోడు ప్లే ఆఫ్ సమరంలో విరాట్ కోహ్లీకి దారుణమైన రికార్డు ఉంది. తన కెరియర్ లో విరాట్ కోహ్లీ మొత్తం 17 ప్లే ఆఫ్ మ్యాచ్ లు ఆడాడు. అతడి సగటు 26.40, 121.10 స్ట్రైక్ రేట్.. పైగా అతడు 396 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతడు రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. అతడి అత్యధిక స్కోర్ 70 *(2011లో చైన్నై జట్టుతోజరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్‌లో అతడు ఈ స్కోర్ చేశాడు)
ప్లే ఆఫ్ లో ఐదుసార్లు అతడు సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యాడు. ఒకసారి సున్నా పరుగులకే ఔటయ్యాడు. ఐదుసార్లు ఏకంగా 30 పరుగుల లోపే వెనక్కి వెళ్లిపోయాడు. గడిచిన సీజన్లో ప్రీతిజింటా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. ఫైనల్ మ్యాచ్‌లో 35 బంతులు ఎదుర్కొని 43 పరుగులు చేశాడు. అతని ప్లే ఆఫ్ రికార్డ్‌లో నిరాశకు గురవుతున్ననేపథ్యం పాతజ్జాపకాలను మరిచిపోయి, విరాట్ ఒక రేంజ్లో బ్యాటింగ్ చేయడానికి అభిమానులు కోరుతున్నారు.

