శ్రేయాస్ అయ్యర్ సోదరి వివాదం: అభిమానం ఒక స్థాయి వరకు ఉండాలి. అది హద్దులు దాటితే పరిణామాలు దారుణంగా ఉంటాయి. అందుకే ఏ రంగంలోనైనా కట్టలు తెంచుకునే అభిమానం ఉండకూదని విశ్లేషకులు చెబుతుంటారు. పైగా అభిమానం అనే మత్తులో ఉన్మాద చర్యలు సరికావని చెబుతారు. కానీ మనదేశంలో అభిమానం ముసుగులో దారుణాలకు అభిమానులే ఎక్కువగా ఉంటారు. పైగా తాము చేస్తున్న పనులను సమర్థించుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ఈ తరహా ఉన్మాదుల దారుణాలు పెరిగిపోయాయి.
ఉన్మాదులైన అభిమానుల తీరు వల్ల మిగిలినవారు మాత్రమే కాదు, చివరికి సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడతారు. ఈ జాబితాలో చేరిపోయారు ప్రముఖ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ట అయ్యర్. ఆమె అప్పట్లో చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె మీద విమర్శలకు కారణం. శ్రేష్ట కొద్ది రోజుల క్రితం కోల్ కతా, పంజాబ్ జట్టు మధ్య జరిగిన మ్యాచ్ చూసేందుకు హాజరైంది. వర్షం వల్ల ఆమ్యాచ్ రద్దయింది. ఈ నిర్వాహకులు చేరో పాయింట్ ను ఇరు జట్లకు కేటాయించారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో శ్రేష్ట ఒక వీడియో పోస్ట్ చేసింది. కోల్ కతా జట్టుకు తాము ఒక పాయింట్ బిచ్చం వేసినట్టు డ్యాన్స్ చేసింది. సెటైరికల్ గా మీమ్ కూడా చేసింది. అదికాస్త సోషల్ మీడియాలో సంచలనమైంది. ఈక్రమంలో ఇటీవల వరుసగా మ్యాచ్ లు ఓడిపోయి ఆఫ్ ఆశలను కోల్పోయింది. టాప్ స్థానంలో నిలిచిన ఆ జట్టు.. ఇతరజట్ల ఫలితాల మీద ఆధారపడే స్థాయికి దిగజారింది.
పంజాబ్ లీగ్ దశలో చివరి మ్యాచ్ గెలిచినప్పుడు ఒక్క పాయింట్ తేడాతో ప్లే ఆఫ్ కు దూరమైంది. నాడు కోల్ కతాతో జరిగిన మ్యాచ్ వర్షంవల్ల రద్దు ఒక్క పాయింట్ ను బిచ్చం వేశామని శ్రేష్ట మీమ్ రూపొందించడంతో నెటిజన్లు ఆమెను విమర్శించడం ప్రారంభించారు. పంజాబ్ దరిద్రానికి శ్రేష్టనే కారణమంటూ. ఈక్రమంలో శ్రేష్ట ఓ వీడియో విడుదల చేశారు. తాను కేవలం సరదా కోసమే ఆ వీడియోను రూపొందించినట్లు చెప్పారు. ఎవరినీ టార్గెట్ చేసి రూపొందించారని వివరించారు. తనను అనవసరంగా వివాదాలలో కి లాగవద్దని సూచించారు. కొంతమంది వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావిస్తున్నారని, ఇది సరైన విధానంకాదని శ్రేష్ట తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియోలో పేర్కొనబడింది.
ట్రోల్స్‌పై శ్రేయస్ అయ్యర్ సోదరి ఫైర్..
తనపై వస్తున్న సామాజిక మాధ్యమాల విమర్శలపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ తీవ్రంగా స్పందించారు.
KKR మ్యాచ్ తర్వాత తాను కేవలం సరదా కోసమే వీడియో చేశానని, ఎవరినీ అవమానించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
కొందరు… pic.twitter.com/Z2qiEqYxMn— ఛోటాన్యూస్ యాప్ (@ChotaNewsApp) మే 25, 2026

