SLW vs IREW : మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్ ఆశలు మిణుకుమిణుకుమంటున్న వేళ.. శ్రీలంక అదిరే విజయం సాధించింది. కెప్టెన్ చమరి ఆటపట్టు(106 నాటౌట్) విధ్వంసక ఆటతో ఐర్లాండ్ బౌలర్లపై విరుచుకుపడగా 6 వికెట్లతో లంక గెలుపొందింది.
SLW vs IREW : మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్ ఆశలు మిణుకుమిణుకుమంటున్న వేళ.. శ్రీలంక అదిరే విజయం సాధించింది. కెప్టెన్ చమరి ఆటపట్టు(106 నాటౌట్) విధ్వంసక ఆటతో ఐర్లాండ్ బౌలర్లపై విరుచుకుపడగా 6 వికెట్లతో లంక గెలుపొందింది. స్వల్ప ఛాదనలో ప్రత్యర్థి బౌలింగ్ దళాన్ని తుత్తునియలు చేసిన ఆటపట్టు ఈ సీజన్లో తొలి సెంచరీ.. మొత్తంగా నాలుగో టీ20 వందతో రెచ్చిపోయింది. దాంతో,16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకున్న లంక రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో గ్రూప్ బీ నుంచి నాలుగో స్థానంలో నిలిచింది.
సెమీస్ ఆశలుగా మారిన వేళ శ్రీలంక సూపర్ విక్టరీ కొట్టింది. కౌంటీ గ్రౌండ్లో మంగళవారం ఐర్లాండ్‌ను వణికించిన లంక భారీ విజయంతో నాకౌట్ రేసులో నిలిచింది. 131 పరుగుల ఛేదనలో నిర్దాక్షిణ్యంగా ఐర్లాండ్ బౌలర్లపై విరుచుకుపడిన చమరి ఆటపట్టు(106 నాటౌట్) ఖతర్నాక్ శతకంతో రెచ్చిపోయింది. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి బాదిన తను 30 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టింది. యాభై తర్వాత తను మరింత చెలరేగి ఆడి జట్టును విజయానికి చేరువ చేసింది.
A 𝙘𝙚𝙣𝙩𝙪𝙧𝙮 𝙤𝙛 𝙨𝙞𝙭𝙚𝙨 కోసం చామరి అథాపత్తు 👏
ది #SL సారథి ఒక మోకాలిపై కూర్చుని, T20I లలో ఆమె 100వ సిక్స్‌ను సాధించడానికి దానిని పూర్తిగా క్రంచ్ చేశాడు 🙌
ICC మహిళల #T20 ప్రపంచకప్ 2026 | #SLvIRE | ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం చేయండి! 👉 https://t.co/vSGsx9oTZ4 pic.twitter.com/lnqmmuhSqT
— స్టార్ స్పోర్ట్స్ (@StarSportsIndia) జూన్ 23, 2026
లంక స్కోర్ 98 వద్ద ఓపెనర్ ఇమేష దులానీ(20) ఔటయ్యాక కెల్లీ ఓవర్లో ఫోర్, సింగిల్‌తో ఈ ఎడిషన్‌లో తొలి శతకం నమోదు చేసింది. మొత్తంగా ఈ ఫార్మాట్లో ఆమెకిది నాలుగో సెంచరీ. 16వ ఓవర్ మూడో బంతకి బౌండరీతో 9 వికెట్ల విజయంతో గ్రూప్ బీలో సెమీస్ రేసును ఆసక్తికరంగా మార్చేసింది శ్రీలంక. ఇప్పటికే హ్యాట్రిక్ ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించిన ఐర్లాండ్ నాలుగో పరాజయం మూటగట్టుకుంది.
SL W 🇱🇰 : 1️⃣3️⃣4️⃣-1️⃣ (15.3 ఓవర్లు)
అథాపత్తు* : 1️⃣0️⃣6️⃣⁶¹
ఇమేషా : 2️⃣0️⃣²⁷ప్రీండర్గాస్ట్ : 1️⃣-2️⃣2️⃣⁴
SL W 🇱🇰 9️⃣ వికెట్ల తేడాతో గెలిచింది #SLvsIRE #SLWvsIREW #T20 ప్రపంచకప్ #మహిళలు T20 ప్రపంచకప్ #క్రికెట్ #శ్రీలంక #ఐర్లాండ్pic.twitter.com/Hq4J3ejgsm https://t.co/CtfeR76I9e
— క్రికెట్ ప్రేమికుడు 🏏 (@Crick97924Lover) జూన్ 23, 2026

