SRH Vs Rajasthan Eliminator: మరికొద్ది సేపట్లో హైదరాబాద్, రాజస్థాన్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్, హైదరాబాద్ జట్లు విజయం సాధించి ఫైనల్ వెళ్లాలని గట్టి పట్టుదలతో ఉన్నాయి. రెండు జట్లలో కూడా సూపర్ బ్యాటర్లు ఉన్నారు. ప్రస్తుత ఐపిఎల్ సీజన్లో సూపర్ ఫాం కొనసాగుతోంది. క్వాలిఫైయర్ మ్యాచ్ కావడంతో రెండు జట్లలో ఆటగాళ్లు దుమ్ము రేపే అవకాశం ఉంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టులో అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా 15 సంవత్సరాల బాలుడు వైభవ్ సూర్య వంశీ పేరుగాంచాడు. ఇతడు ఈ సీజన్ లో హైదరాబాద్ జట్టు మీద అతడు రెండు మ్యాచ్ లు ఆడాడు. రెండో మ్యాచ్లో సెంచరీ చేశాడు. అతను తక్కువ పరుగులు చేసినప్పుడు.. సెంచరీ చేసినప్పుడు ఇలా రెండు సందర్భాల్లో రాజస్థాన్ జట్టు ఓటమి పాలు కావడం విశేషం.
వైభవ్ సూర్య వంశీ కి అవకాశం ఇస్తే మాత్రం దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. అతడు అండగా ఉంటే రాజస్థాన్ జట్టు స్కోరు మెరుపు వేగంతో దూసుకుపోతూ ఉంటుంది. రాజస్థాన్ జట్టు భారీ స్కోర్ చేస్తే హైదరాబాద్ జట్టుకు తీవ్రమైన ఇబ్బంది తప్పదు. అందువల్లే అతడిని ఆదిలోనే కట్టడి చేస్తే హైదరాబాద్ జట్టుకు భారీగా లాభం చేకూరుతుంది. అందువల్లే ఇదే ప్రదర్శన హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ ప్రముఖంగా ప్రస్తావించాడు. సూర్య వంశీ ని కట్టడి చేయడానికి తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయని అతడు ఉన్నాడు.
“ప్రతి జట్టులో కూడా కొంతమంది ప్లేయర్లు ఉంటారు. వారు మ్యాచ్ ఫలితాన్ని వన్ సైడ్ చేస్తారు. వారిని ఆపాలంటే రకరకాల ప్లాన్లు అవసరం

