శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారి దర్శనానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల భక్తులు తరలి రావడంతో మల్లన్న ఆలయం భక్తులతో కిటకిట లాడుతుంది. దీంతో మల్లికార్జున స్వామి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతుంది.
మూడు గంటల సమయం…
భక్తులతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. వేకువజాము నుంచే స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు క్యూలలో వేచి ఉన్నారు. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో శ్రీశైలం ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

