Sunrisers Vs RCB టిక్కెట్ ధరలు: సీట్లు బాగుండవు. ఒకవేళ బాగున్నా అనిపించేలా.. అందులో పావురాల రెట్టలు కనిపిస్తాయి. దుమ్ము ధూళి.. ఇంకా చెప్పాలంటే ఎన్నో రకాల అపరిశుభ్రం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అటువంటి చోట టికెట్ మ్యాచ్ చూడటమే ఇబ్బంది అనుకుంటే.. పైగా వేలకు వేలు కోసం ఖర్చు పెట్టాలి. ఇప్పుడైతే అంతకుమించిన స్థాయిలో ధర పెంచారు. చోట క్రికెట్ మ్యాచ్ ఎలా చూడాలి.. జేబులకు చిల్లు పెట్టుకుని.. కార్పొరేటర్లకు ఇవ్వాలా.. దీనిని క్రికెట్ అంటారా.. ఇంతగానం రేట్లు ఎందుకు పెంచినట్టు.. ఎవరి కోసం పెంచినట్టు..
ఐపీఎల్ అనేదే ఒక పెద్ద దందా.. ఇటీవల గుజరాత్ ఆడిన మ్యాచ్ లు చూస్తే అది అర్థమవుతుంది. ఇంకా లోతుల్లోకి వెళ్లడం లేదు గానీ.. ఈ సీజన్లో డ్రీం లె లాంటి మట్కా కంపెనీలకు అవకాశం లేకుండా పోయింది. అందువల్ల ఆ లోటును ఇదిగో ఇలా మార్చుకుంటున్నారు. అడ్డగోలుగా ధరలు పెంచేసి.. క్రికెట్ అంటే అభిమానం ఉన్న ప్రేక్షకుల జేబులకు జేబు దొంగల కంటే దారుణంగా చిల్లులు పెడుతున్నారు. వందల ధరను వేలకు.. వేల ధరను అంతకుమించిన వేలకు పెంచి అభిమానులను దోచుకుంటున్నారు.
హైదరాబాద్ జట్టు ఐపీఎల్లో ప్లే ఆఫ్ దాకా వచ్చింది. ఇటీవల గుజరాత్ చేతుల్లో దారుణంగా ఓడిపోయింది. అత్యంత భీకరమైన బ్యాటింగ్ లైనపు ఉన్న హైదరాబాద్ జట్టు అలా ఆడటం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్లేయర్లు కావాలని అవుట్ అయ్యారా.. గుజరాత్ ముందు కావాలని తలవంచారా.. సోషల్ మీడియాలో ఇలా ప్రచారం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ ముందు కీలకమైన మ్యాచ్ ఆడుతోంది. బెంగళూరు తో తలపడుతోంది. ఈ సీజన్లో బెంగళూరుతో తలపడిన తొలి మ్యాచ్లో హైదరాబాద్ ఓడిపోయింది.
ప్లే ఆఫ్ ముందు బెంగళూరు తో తలపడుతున్న నేపథ్యంలో.. దీనికి విపరీతమైన ప్రాధాన్యత ఏర్పడింది. హైదరాబాద్ జట్టు సొంత గడ్డమీద ఆడుతున్న నేపథ్యంలో పెద్దలను విపరీతంగా పెంచారు. టికెట్ ధరలు ఈ స్థాయిలో పెంచడం పట్ల విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. 22న ఉప్పల్ మైదానంలో బెంగళూరుతో ఈ మ్యాచ్ జరుగుతుంది. 950 రూపాయలు ఉన్న టికెట్ ధరను 2000కు పెంచారు. 1500 రూపాయల ఉన్న టికెట్ ధరను మూడు వేలకు పెంచారు. 1910 రూపాయల ధర ఉన్న టికెట్ 3500 కు పెంచింది.. 2500 ధర ఉన్న టికెట్ 4500, 4500 టికెట్ 6వేలకు.. 7వేల టికెట్ 10,000 కు, 23 వేల బాక్స్ టికెట్ 30 వేలకు.. 30 వేల రూపాయల కార్పొరేటర్ బాక్స్ టికెట్ 45 వేలకు.. అసలు ఈ స్థాయి ధరల ధరలు ఎందుకు విడుదలయ్యాయి. లేదని.. ఇలా పెంచి తమ జేబులకు చిల్లు పెడుతున్నారు అభిమానులు.

