ప్రముఖ క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, మహారత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా భారతదేశపు మొట్టమొదటి ఆన్-డిమాండ్ LPG సిలిండర్ డెలివరీ సేవలను ప్రారంభించింది. ఈ భాగస్వామ్యంతో అత్యవసర గృహ వినియోగ వస్తువును తక్షణ డెలివరీ వ్యవస్థలోకి తీసుకువస్తుంది. ఇన్‌స్టామార్ట్‌లో HPCL కొత్తగా ప్రవేశపెట్టిన HP నవ్య 10 కేజీల కాంపోజిట్ LPG సిలిండర్ డెలివరీ చేయనుంది. ఈ సేవలు మొదట బెంగళూరులో అందుబాటులోకి రానున్నాయి.
ఈ సేవ ద్వారా ఆధునిక గృహాల కోసం రూపొందించిన నెక్స్ట్-జనరేషన్ కాంపోజిట్ ఎల్పీజీ సిలిండర్ అయిన HP నవ్యను ఆర్డర్ చేయవచ్చు. ఈ సిలిండర్ తేలికైనది, తుప్పు కూడా పట్టదు. మెరుగైన భద్రతా లక్షణాలతో కూడి ఉంటుంది. ఈ కాంపాక్ట్ డిజైన్.. అపార్ట్మెంట్లు, చిన్న కుటుంబాలు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, వాస్తవం ఉంటుంది. హెచ్‌పీ నవ్యతో పాటు, ఇన్‌స్టామార్ట్ హిచ్పీసీఎల్ 5 కేజీల గ్యాస్ LPG సిలిండర్‌ను కూడా అందిస్తుంది. స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్, హెచ్‌పీసీఎల్ భాగస్వామ్యంతో LPG సిలిండర్ డెలివరీని ఇప్పటికే ప్రారంభించింది.
ఈ సిలిండర్ ఆర్డర్ కోసం ఇప్పటికే గృహ LPG కనెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. మొదటిసారి చేసే కొనుగోళ్లను కొత్త సిలిండర్ కొనుగోళ్లుగా పరిగణిస్తారు. అయితే డెడ్ ఆర్డర్లు రీఫిల్ అభ్యర్థనలుగా పనిచేస్తాయి, వినియోగదారులకు ఖాళీ హెచ్‌పీసీఎల్ సిలిండర్‌ను తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్‌స్టామార్ట్ ద్వారా చేసిన ఆర్డర్లను హెచ్‌పీసీఎల్ అధీకృత పంపిణీదారుల నెట్వర్క్ ద్వారా పంపిణీ చేస్తారు. మొదటిసారి కొనుగోలు చేసేవారి గుర్తింపు ధృవీకరణ జరుగుతుంది.
ఇన్‌స్టామార్ట్ తన వినియోగ సందర్భాలను కిరాణా వస్తువులకు మించి విస్తరించింది, రోజువారీ జీవితంలో ఒక భాగంగా మారిందని ఇన్‌స్టామార్ట్ సీఈఓ అమితేష్ ఝా తెలిపారు. 131కి పైగా నగరాల్లో 50,000కు పైగా స్టాక్-కీపింగ్ యూనిట్లను అందిస్తున్న ఇన్‌స్టామార్ట్‌కు, ఈ భాగస్వామ్యం మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది. 10 కిలోల సిలిండర్, 5 కిలోల సిలిండర్ కావాలంటే.. స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ యాప్‌లో బుక్ చేసుకోవచ్చు.

