తెలంగాణ కీలక బీజేపీ సమావేశాలు నేడు జరగనున్నాయి. పార్టీ కార్యవర్గ సభ్యులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కూడా చర్చించనున్నారు.
వరస సమావేశాలతో…
అలాగే నేడు బీజేపీ అనుబంధ విభాగంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు భేటీకానున్నారు. అనుబంధ విభాగాలు మరింత బలోపేతం చేయడంపై చర్చించనున్నారు. ఈరోజు సాయంత్రం బీజేపీ ప్రజాప్రతినిధుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి చార్జ్ అభయ్ పాటిల్ హాజరుకానున్నారు.

