టాలీవుడ్ ఎగ్జిబిటర్ల వివాదం : మరో 9 రోజుల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఎక్కడ చూసిన పెద్ది మేనియా నే. ఆ స్థాయిలో మేకర్స్ ప్రొమోషన్స్ చేస్తున్నారు. అయితే ‘పెద్ది’ సమస్యలు ఇంకా పూర్తిగా వీడిపోలేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గానే ఎక్సిబిటర్స్ గిల్డ్ మరియు ప్రొడ్యూసర్స్ గిల్డ్ మధ్య జరిగిన గొడవలు మనమంతా చూశాము. మాకు ఎట్టి పరిస్థితిలోనూ కమీషన్ బేసిస్ మీదనే సినిమాలను రన్ చెయ్యాలి, లేదంటే థియేటర్లలో మూసేస్తామని ఎక్సిబిటర్స్ గిల్డ్ సభ్యులు, అదే విధంగా మేము నిర్దిష్టమైన ప్రణాళికలు, షరతులు లేకుండా, కమీషన్ బేసిస్ మీద థియేటర్లు ని రన్ చేయడానికి ఒప్పుకోము అంటూ నిర్మాతలు మీడియా ముందుకొచ్చి కొట్లాడుకున్నారు.
ఆ తర్వాత రెండు రోజులకు ఈ రెండు గిల్డ్స్ మధ్య చర్చలు జరగడం, ఈ చర్చలు చివరికి వాతావరణంలో మొదలైనప్పటికీ, సామరస్యపూర్వకంగానే చర్చలు ముగించడం, ఆ తర్వాత స్వయంగా దిల్ రాజు నే ‘పెద్ది’ చిత్రం ఎలాంటి ఆటంకాలు ఉండవని , స్మూత్ గానే విడుదలైన తర్వాత మాట ఇవ్వడంతో ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడింది. అయితే ఇప్పుడు ఎక్సిబిటర్స్ మరోసారి స్వరం మార్చారు. మాకు ఎట్టి పరిస్థితిలోనూ ‘పెద్ది’ చిత్రం నుండే కమీషన్ బేసిస్ మీద థియేటర్స్ ని నడిపే విధానం కావాలి అంటూ మీడియా ముందుకొచ్చారు. నేడు ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో కూడా భేటీ అయ్యారు. దిల్ రాజు, అల్లు అరవింద్, ఏషియన్ సునీల్, సురేష్ బాబు లతో పాటు పలువురు కీలక నిర్మాతలు కమ్ ఎక్సిబిటర్స్ ఈ భేటీలో ఉన్నారు.
చిరంజీవి కి ప్రస్తుతం థియేటర్స్ ఎదురుకుంటున్న సమస్యలను వివరించి, కమీషన్ బేసిస్ మీద నడుపుకునేలా అడుగులు ముందుకు వేసేందుకు సహకరించమని కోరడం , అందుకు చిరంజీవి కూడా సానుకూలంగానే రెస్పాన్స్ ఇచ్చాడని దిల్ రాజు చెప్పడం కోసం కాసేపటి క్రితమే జరిగాయి. మరో రెండు రోజుల్లో కీలక సమావేశం ఉందట , అదే విధంగా రాజమండ్రి పర్యటనలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కూడా వీళ్లంతా రేపు భేటీ అవ్వబోతున్నారట. త్వరలోనే దీనికి శాశ్వత పరిష్కారం జరగనుంది. అయితే ఒకవేళ సానుకూల ఫలితాలు రాకపోతే, తెలంగాణ ప్రాంతంలో తీవ్రమైన ఇబ్బందులకు గురిచేసే ప్రణాళికలు దిల్ రాజు సిద్ధం చేస్తున్నాయి , టికెట్ హైక్స్ రానివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు , మరి ఏమి జరగబోతుందో చూడాలి.

