యుపి హమీర్పూర్ వంతెన కూలిపోయింది: అది మామూలు గాలి కాదు. ప్రచండమైన గాలి.. విపరీతమైన వేగంతో దూసుకొచ్చింది. దూసుకురావడమే కాదు, పెను ఉత్పాతాన్ని సృష్టించింది. ఆ గాలి తాకిడికి చిన్న చిన్న వస్తువులు కాదు, పెద్ద పెద్ద హోర్డింగులు చిగురుటాకులా వణికి పోయాయి. విరిగిపోయి గాలిలో తేలియాడాయి. ఆ గాలి అక్కడితోనే ఆగిపోలేదు. ఆ స్థాయి నష్టం తోనే ఆగిపోలేదు. ఆ రాష్ట్ర చరిత్రలోనే ఘోరమైన నష్టానికి కారణమైంది.
ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భీకరమైన గాలులు వీచాయి. విపరీతంగా వర్షం కురిసింది. ఈ దారుణమైన ఘటన వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అంతకంటే ఎక్కువ సంఖ్యలో గాయపడ్డారు. అయితే ఈ సంఘటనలను మర్చిపోకముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్పూర్ బెత్వ నది మీద వంతెన హోరుగాలి తాకిడికి కూలిపోయింది. గాలి తాకిడికి బ్రిడ్జి మొత్తం ఊగిపోయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు కార్మికులు కన్నుమూశారు. అర్ధరాత్రి సమయంలో గాలి విపరీతంగా రావడంతో.. ఆ వేగానికి వంతెన ఊగిపోయి కూలిపోయింది. దీంతో గాడ నిద్రలో ఉన్న ఆరుగురు కార్మికులు చనిపోయారు.
కోట్ల ఖర్చుతో ఆ వంతెన ఈదురు గాలుల వల్ల ఊగిపోయి కూలిపోయింది. ముందుగా గడ్డర్లు ఊగిపోయాయి. ఆ తర్వాత ఐరన్ సామాగ్రి నేల కూలింది. దీంతో కార్మికులు నిద్రలోనే వాటి కింద పడిపోయి కన్నుమూశారు. వరకు గాయపడ్డారు. ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో రికార్డులు నమోదు అవుతున్నాయి. అదే స్థాయిలో వర్షాలు కూడా కురుస్తున్నాయి. గాలుల తీవ్రత వల్ల నష్టం అపారంగా చోటుచేసుకుంటున్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ వేసవికాలంలో ఈ స్థాయిలో ఈదురుగాలులు వీచలేదు. వర్షాలు కురియలేదు. ఈసారి మాత్రమే పరిస్థితి ఉంది. దీనివల్ల ఆస్తి నష్టంతో పాటు.. ప్రాణనష్టం కూడా విపరీతంగా చోటు చేసుకుంటున్నది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల విపరీతంగా వేడెక్కిందని.. దానివల్ల వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని.. అందుకే ఇలా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆ సమయంలో అప్రమత్తంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు.. ఈదురుగాలులు వీస్తున్నప్పుడు ఆరుబయట నిద్రపోవడమే మంచిదని చెబుతున్నారు.
హమీర్పూర్, ఉత్తరప్రదేశ్ – భారీ వర్షం మరియు బలమైన గాలుల కారణంగా బెత్వా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన యొక్క కాంక్రీట్ స్లాబ్ కూలిపోవడంతో ఒక పెద్ద విషాదం, కింద నిద్రిస్తున్న ఆరుగురు కార్మికులు మరణించారు. ఈ సంఘటన మోర్కందర్ పర్సాని మరియు నైతి గ్రామం మధ్య జరిగింది… pic.twitter.com/OJ5Q6ONC4w
— నెక్స్ట్ మినిట్ న్యూస్ (@nextminutenews7) మే 29, 2026

