విశాఖపట్నం: ఒమన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై జరిగిన అమెరికా సైనిక దాడిలో ముగ్గురు భారతీయులు మృతి చెందడం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన 44 ఏళ్ల మెరైన్ చీఫ్ ఇంజనీర్ సురేష్ కూడా ఉన్నారు. ఈ దాడిపై సురేష్ భార్య భార్గవి పీటీఐతో మాట్లాడారు. భర్త జూన్ 9న తనతో ఫోన్లో మాట్లాడారని, అక్కడ పరిస్థితులు ఏం బాగోలేవని, త్వరలోనే ఇంటికి వచ్చేయాలని చెప్పారని చెప్పారు. జూన్ 10న అమెరికా చేసిన దాడిలో ఆయన చనిపోయారు. గత 5 నెలలుగా సముద్రంలో విధుల్లో ఉన్న సురేష్, త్వరలోనే ఇంటికి రావాల్సి ఉండగా ఈ విషాదం సంభవించింది. ఈ ఘటనతో సురేష్ స్వస్థలమైన విశాఖపట్నంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
సురేష్ విధులను ముగించి ఇంటికి తిరిగి రావడం కోసం ఇప్పటికే రిలీవింగ్ లెటర్ (ఉద్యోగ విధులనుండి విడుదలకు సంబంధించిన పత్రం) కూడా లభించిందని భార్య భార్గవి తెలిపారు. తాను బాగా అలసిపోయానని, ప్రస్తుత పరిస్థితులు కూడా బాగోలేవని తన భర్త రిక్వెస్ట్ చేసుకున్నారని చెప్పారు. తన స్థానంలో వచ్చే మరో సిబ్బందికి బాధ్యతలు అప్పగించి, నౌక దిగి కుటుంబంతో కలవడానికి సిద్ధమవుతున్న తరుణంలోనే ఈ ఘోర ప్రమాదం జరిగి ఆయన ప్రాణాలు కోల్పోయారు. జరిగిన తరువాత రెస్క్యూ టీం వారిని కాపాడాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, మరికొందరు సిబ్బంది సైతం డ్యూటీ ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
వీడియో | విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి: ఒమన్ తీరంలో నౌకా దాడిలో మరణించిన చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ భార్య భార్గవి మాట్లాడుతూ, “నిన్న రాత్రి, వారు నాకు ఫోన్ చేసి, ‘అసౌకర్యానికి క్షమించండి, మీ భర్త నౌకపై డ్రోన్ దాడి జరిగింది. pic.twitter.com/7R4cySRpEs
— ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (@PTI_News) జూన్ 11, 2026
నలుగురం ఇప్పుడు ముగ్గురం అయ్యాం..
జూన్ 24న తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని సురేష్ ఎంతో ఆశగా ఎదురుచూశారని ఆయన భార్య భార్గవి కన్నీరుమున్నీరయ్యారు. “మేము నలుగురం ఉండేవాళ్లం, ఇప్పుడు ముగ్గురమే మిగిలాం” అంటూ భార్గవి తన ఆవేదనను పంచుకున్నారు. ఆ కంపెనీకి వర్క్ చేస్తుండగా ఆన్ డ్యూటీలో ప్రమాదం జరిగింది. నా, మా పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేస్తారని అడిగినట్లు చెప్పారు. కంపెనీని నమ్ముకుని ప్యాషన్‌తో నా భర్త ఉన్నారు. ఆయనను నమ్ముకుని మేం ముగ్గురు ఇక్కడ ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడిలో చనిపోయిన చీఫ్ ఇంజనీర్ సురేష్‌కు భార్య భార్గవితోపాటు 13, 10 ఏళ్ల వయసున్న కుమారులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: ఒమన్‌లో హతమైన భారతీయ నావికులు: హోర్మూజ్ సమీపంలోని నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!
లిస్టులో తొలిపేరు నా భర్తదే..
‘నిన్న రాత్రి వారు నాకు ఫోన్ చేశారు. మెసేజ్ కూడా చేశారు. మీకు కలిగినందుకు క్షమించండి. మీ భర్త పనిచేస్తున్న నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ముగ్గురు భారత సిబ్బంది గల్లంతయ్యారు. వారు తెలిపిన మొదటి పేరు నా భర్తదే, ఆ తర్వాత మిగిలిన ఇద్దరు సిబ్బంది పేర్లు చెప్పారు. ఆ తర్వాత, నేను వారితో ఫాలో అప్ చేస్తూనే ఉన్నాను. నేను సూపరింటెండెంట్ కాంటాక్ట్ వివరాలను అడగ్గా, వారు నాకు దుబాయ్ ఆఫీస్ నంబర్ ఇచ్చారు. నేను వారిని కాంటాక్ట్ అయినప్పుడు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని వారు చెప్పారు. 21 మంది సిబ్బందిని రక్షించామని, ముగ్గురు గల్లంతయ్యారని నాకు చెప్పారు.
ఆన్లైన్లో చాలాసేపు సెర్చ్ చేశాక, మిగిలిన ఇద్దరు సిబ్బంది మృతదేహాలు అప్పటికే లభ్యమయ్యాయని, వారిని గుర్తించారని కనిపించింది. మిగిలిన 21 మంది సిబ్బందిని రక్షించారు. కేవలం చీఫ్ ఇంజనీర్ అయిన నా భర్త ఆచూకీ మాత్రమే తెలియలేదు. రాత్రి కావడం వల్ల రెస్క్యూ ఆపరేషన్ సాధ్యం కాకపోవచ్చని నేను భావించాను. మరుసటిరోజు ఉదయం నుండి ఫాలో అప్ చేశాం. వారికి కొన్ని నిబంధనలపై స్పందించారు. కొన్ని ప్రయత్నాల తర్వాత నా కాల్స్ ఎత్తారు. మధ్యాహ్నం 1 గంటకు ఆయన మృతదేహం లభ్యమైందని వారు ధృవీకరించారని’ పీటీఐకి తెలిపారు.
లీఫ్ హెల్మెట్ ధరించిన వ్యక్తి వైరల్ వీడియో | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!

