పెద్ది సినిమా USA బాక్సాఫీస్ వద్ద అంచనాలు: మరో 16 రోజుల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అభిమానుల ఆశలతో పాటు , ట్రేడ్ కూడా ఆశలు కూడా నెరవేర్చే బాధ్యత ఈ చిత్రం పైన ఉంది. ఎందుకంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పరిస్థితి ప్రస్తుతం అసలు బాగాలేదు కాబట్టి. నిన్ననే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి డివైడ్ రెస్పాన్స్ వచ్చింది. కంటెంట్ కచ్చితంగా బలంగానే ఉంది కానీ , థియేట్రికల్ ట్రైలర్ లో ఎలివేషన్స్ పెట్టి ఉంటే బాగుండేది , దాని వల్ల ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ బాగా పెరిగేవి అనేది అభిమానుల అభిప్రాయం. ప్రస్తుతానికి ఈ విడుదల 3 లక్షల 40 వేల డాలర్లు USA నుండి వచ్చాయి. అయితే ప్రస్తుతానికి USA లో టాప్ 3 స్థానాల్లో ఉన్న సినిమాలేంటి , వాటికి ఎన్ని టికెట్లు అమ్ముడుపోయాయి?, పెద్ది ఏ రేంజ్ కి చేరుకోగలదు అనేది ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతానికి మొదటి స్థానం లో ప్రభాస్ ‘కల్కి’ చిత్రం ఉంది. ఈ చిత్రం కేవలం USA లో 92132 టికెట్లు అమ్ముడుపోగా, ఓవరాల్ నార్త్ లో 2.7 మిలియన్ అమెరికా అమెరికన్ ప్రీ సేల్స్ ని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా ప్రీమియర్స్ నుండి 3.9 మిలియన్ డాలర్లు (అన్ని భాషలు) వచ్చాయి. ఇక ఆ తర్వాతి స్థానం లో రాజమౌళి #RRR చిత్రం ఉన్నది. ఈ చిత్రం కేవలం USA నుండి 89767 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ప్రీ సేల్స్ గ్రాస్ 2.5 మిలియన్ డాలర్లు రాగా , ఓవరాల్ ప్రీమియర్స్ 3.4 మిలియన్ డాలర్లు (అన్ని భాషలు) వచ్చాయి. ఇక ఆ తర్వాత స్థానం లో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం నిలిచింది.
ఈ చిత్రం88253 టిక్కెట్లు అమ్ముడుపోగా, 2.5 మిలియన్ డాలర్ల ప్రీ సేల్స్ గ్రాస్ వచ్చింది. మూవీ టీం సమయానికి కంటెంట్ డెలివరీ చేయకపోవడం , కెనడాలో యార్క్ చైన్ విడుదల చేయకపోవడం వల్ల, ఈ చిత్రం చాలా గ్రాస్ మైనస్ అయ్యింది , లేదంటే 3 మిలియన్ డాలర్ల ప్రీమియర్, 4 మిలియన్ డాలర్ల ఓవరాల్ ప్రీమియర్స్ గ్రాస్ వచ్చేది. కానీ ప్లానింగ్ లోపం కారణం 3.1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. పెద్ద అయితే ఈ రేంజ్ గ్రాస్ వస్తుందా అంటే కచ్చితంగా రాదు అని చెప్పాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ని బట్టీ ఈ చిత్రం కేవలం 1.6 చూస్తే మిలియన్ డాలర్ల గ్రాస్ మాత్రమే ప్రీమియర్స్ నుండి వచ్చేలా అనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ట్రెండ్ మారితే 2 మిలియన్ డాలర్ గ్రాస్ కూడా రావొచ్చు, మరి ఏమి జరగబోతుంది.

