వైభవ్ సూర్యవంశీ: 15 సంవత్సరాల వయసులోనే క్రికెట్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ కాంట్రాక్టులు.. ఇతర వ్యవహారాల ద్వారా అతడు ఇప్పటివరకు ఏడు కోట్ల సంపాదించాడు. ఈ స్థాయిలో సంపాదించాడు కాబట్టి.. అతడి ఆదాయపు పన్ను ఎవరు చెల్లించాలి.. 15 ఏళ్ల వయసులో ఏడు కోట్లు సంపాదిస్తే.. దానికి సంబంధించిన ఆదాయపు పన్ను చెల్లించే అవకాశం ఉందా.. మన దేశానికి సంబంధించిన నిబంధనలు ఎలా ఉన్నాయా..
ఇండియన్ ఐటి చట్టాల ప్రకారం 18 ఏళ్ల లోపు ఉన్న వారిని కౌమార పిల్లల మాదిరిగానే పరిగణిస్తారు. వారు ఒకవేళ ఆ చిన్న వయసులో డబ్బు సంపాదించడంతో అదంతా కూడా వారి పేరెంట్స్ ఆదాయం గానే లెక్కిస్తారు. మామూలుగా పేరు మీద చేసే ఫిక్స్ డ్ పిల్లల డిపాజిట్లు.. ఇన్వెస్ట్మెంట్లు ఈ స్థాయిలోకి వస్తాయి. కౌమార పిల్లల పేరు మీద వచ్చిన ఆదాయాన్ని ఇన్కమ్ టాక్స్ చట్టంలోని సెక్షన్ 64 (1) ఏ ప్రకారం కౌమార పిల్లల ఆదాయాన్ని.. వారి తల్లిదండ్రులలో ఎవరికైతే ఎక్కువ ఆదాయం ఉంటుందో.. వారి ఆదాయంతో కలిసి ట్యాక్స్ వేస్తారు.
సూర్య వంశీ కి మినహాయింపు
ఐపీఎల్ స్టార్ ఆటగాడు సూర్య వంశీ విషయంలో ఒక మినహాయింపు ఇక్కడ ఉంది. కౌమార దశలో ఉన్న ఒక బాలుడు తన సొంత ప్రతిభ లేదా ఇతర నైపుణ్యాల ఆధారంగా.. శారీరకంగా శ్రమించి.. ఆ వృత్తిలో సంపాదించిన డబ్బును ఎట్టి పరిస్థితుల్లో ఆదాయంతో కల్పించకూడదు. సూర్య వంశీ సంపాదన మొత్తం క్రికెట్ కాంట్రాక్టులు.. మ్యాచ్ ఫీజులు.. ఒప్పందాలు మాత్రమే వచ్చాయి. ఈ ఆదాయాన్ని క్రికెట్ ద్వారా సొంతం చేసుకున్న నైపుణ్యం ద్వారానే వచ్చినట్లు భావిస్తారు. అప్పుడు దానిని వైభవ్ సొంత ఆదాయం గానే చూస్తారు.
కేవలం క్రికెట్ మాత్రమే కాదు ఇంకా వివిధ విభాగాలలో గుర్తింపు తెచ్చుకున్న కుమార పిల్లలకు ఇదే సూత్రం వర్తిస్తూ ఉంటుంది. ఇలా సంపాదించిన ఆదాయం మొత్తం కౌమార పిల్లలు తమ పేరు మీదుగా ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ పిల్లల కోసం వారి పేరెంట్స్ లేదా ఇతర సంరక్షకులు ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. వారు రిటర్న్ ల దాఖలు ప్రక్రియ చేయవలసి ఉంటుంది.
సూర్య వంశీ ఆదాయం లేదా వ్యాపారం ద్వారా వచ్చిందని భావిస్తారు. కాబట్టి ఈ స్థాయిలో ఉన్నవారు ఐటిఆర్ 3 లేదా ఐటిఆర్ 4 మాత్రమే దాఖలు చేయవలసి ఉంటుంది. పన్ను ఆదాయం.. పర్సనల్ ఇన్కమ్ చెల్లించే వారికి వర్తించే స్లాబులే సూర్య వంశీకి వర్తిస్తూ ఉంటాయి. సూర్య వంశీ ఆదాయం కోట్లలో ఉంది కాబట్టి అతడు ఏకంగా 30 శాతం వరకు ట్యాక్స్ చెల్లించాలి.

