వీరభద్రుడు కలెక్షన్స్: తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు’ నిన్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సూర్యకి చాలా కాలం తర్వాత పబ్లిక్ లో ఇలా పాజిటివ్ టాక్ రావడంతో , సౌత్ రాష్ట్రాలన్నీ ఊగిపోయాయి. ఒక్క తమిళనాడు లో కాదు , తెలుగు రాష్ట్రాల్లో , కేరళలో, కర్ణాటకలో ఈ చిత్రం బంపర్ ఓపెనింగ్ దక్కింది. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత సౌత్ లో మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న మొట్టమొదటి హీరో సూర్య. ఇన్ని రోజులు ఆయనకు సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడకపోవడం వల్ల , బాగా మార్కెట్ డౌన్ అయ్యింది. కానీ ఇప్పుడు మంచి సినిమా పడేలోపు అన్ని సెంటర్స్ లో బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ ని సొంతం చేసుకుంది. రాష్ట్ర వారీగా ఈ చిత్రం ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
ముందుగా తమిళనాడు విషయానికి వస్తే , మొదటి రోజున 12 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. వరుస ఫ్లాప్స్ లో ఉన్న సూర్య కి ఇది బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ / తెలంగాణ నుండి ఈ చిత్రం 3 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా , కర్ణాటక నుండి 2 కోట్ల 10 లక్షలు, కేరళ నుండి 1 కోటి 80 లక్షలు, నార్త్ ఇండియా నుండి 20 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా చూస్తే ఈ చిత్రం 19 కోట్ల 10 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఓవర్సీ ఓవర్స్ నుండి 9 కోట్ల 25 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా ఈ చిత్రం మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల 35 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 150 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి, ఈ వీకెండ్ కి కచ్చితంగా 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుంది, మొదటి వారమే పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ అయ్యి , సూర్య కెరీర్ లో 14 ఏళ్ల తర్వాత క్లీన్ హిట్ గా నిలిచిన చిత్రంగా నిలబడనుంది. ఇక రెండవ రోజు అయితే అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, చూడాలి మరి ఈ చిత్రం ఎంత దూరం వెళ్లి ఆగుతుంది.

