విశ్వంభర రిలీజ్ అప్డేట్స్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్లో తెరకెక్కిన విశ్వంభర సినిమా గత సంవత్సరం సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కారణాల వల్ల ఈ సినిమా ప్రేక్షకుల ముందు అనుకోకుండా రాలేకపోయింది…కారణం ఏంటి అంటే సినిమాలో సీజీ వర్క్ అంత పెద్దగా సెట్ అవ్వలేదనే ఉద్దేశ్యంతో ఈ సినిమా పోస్ట్ పోన్ చేశారు. ఇక మరో సిజి కంపెనీతో వర్క్ చేసిన కూడా అది అంత పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడం లేదట.
దాంతో చిరంజీవి సైతం ఈ సినిమా మీద ఆశలు వదిలేసుకున్నారనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికైనా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే బాగుంటుంది. అలా కాకుండా ఇంకా ఈ సినిమా మీద బడ్జెట్ ని పెంచుకుంటూ పోతే అది లాస్ ను మిగిల్చే ప్రమాదం కూడా ఉందని ఈ సినిమా మీద కూడా బజ్ తగ్గిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.
ఇక ఇలాంటిదే ఈ సినిమా లేట్ చేయకుండా రిలీజ్ చేస్తే బాగుంటుంది. లేకపోతే భారీ నష్టాలు వచ్చే పరిస్థితి ఏర్పడవచ్చు. చిరంజీవి ఈ సంవత్సరం ఇప్పటికే మనిషికి మన శంకర్ వరప్రసాద్ సినిమాలో సూపర్ సక్సెస్ ని సాధించాడు. కాబట్టి ఆ ఊపులోనే ఈ సినిమా కూడా రిలీజ్ చేస్తే బాగుండేది. ఇక ఈ సమ్మర్ కూడా అయిపోయింది. కాబట్టి ఈ సినిమా సమ్మర్ కి వస్తుంది అనుకున్నప్పటికి అది నిరాశగానే మిగిలింది. మరి ఈ సినిమా మరో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారా?
సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ప్రేక్షకులకు ఒక కిక్కిచ్చే న్యూస్ చిరంజీవి చెప్పబోతున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమా పక్కన పెడితే ప్రస్తుతం చిరంజీవి బాబీ డైరెక్షన్ లో చేయబోయే సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేసాడు…ఈ మూవీతో సూపర్ సక్సెస్ ను సాధించాల్సిన అవసరం ఉంది…

