Vivo X ఫోల్డ్ 6: ప్రముఖ మొబైల్ కంపెనీ Vivo నుండి సరికొత్త ఫ్లాగ్షిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్లో విడుదలైంది. ప్రీమియం డిజైన్, మునుపెన్నడూ లేని భారీ బ్యాటరీ, అదిరిపోయే డిస్ప్లే ఫీచర్లతో ఈ ఫోన్ టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రోజూ మొబైల్ లపై ఎక్కువగా వర్క్ చేసే వారికి ఇది ఉపయోగ పడుతుందని అంటున్నారు. అయితే దీని ధర ఎంత? భారత్ లోకి ఎప్పుడోస్తుంది? ఆ వివరాల్లోకి వెళితే..
Vivo నుంచి మార్కెట్లోకి Vivo X Fold 6 రిలీజ్ అయింది. ఈ మొబైల్ డిస్ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో 8.02 AMOLED ఫోల్డబుల్ స్క్రీన్ ఉండనుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 5000 నిట్స్ కంటే బ్రైట్నెస్ ను అందించడంతో స్మూత్ స్క్రోలింగ్ పనిచేస్తుంది. ఫోన్ మడతపెట్టి ఉన్నప్పుడు వాడుకోవడానికి బయట వైపు 6.51 అక్కడ కవర్ డిస్ప్లే ఉంటుంది.
సాధారణంగా ఫోల్డబుల్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కానీ ఈ ఫోన్లో 7,000mAh భారీ సిలికాన్ కార్బన్ బ్యాటరీని అందించారు. పెద్ద బ్యాటరీ బ్యాటరీ ఫోన్ మడత విప్పినప్పుడు కేవలం 4.4mm మందంతో ఎంతో స్లిమ్‌గా ఉంటుంది. దీనికి తోడు 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో నిల్వ ఉండేవారికి అనుగుణంగా ఉంటుంది.
వివో తన ఫోల్డబుల్ సిరీస్‌లో మొదటిసారిగా స్నాప్‌డ్రాగన్‌ను పక్కనపెట్టి మీడియాటెక్ చిప్‌సెట్‌ను వాడింది. ఇందులో భాగంగా ఇందులో3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సూపర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. దీనితో ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం ఉపయోగించేవారికి సపోర్టుగా ఉండనుంది. సాఫ్ట్వేర్ విషయానికొస్తే.. ఇందులో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
ఫోటోగ్రఫీ పరంగా.. వివో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200MP శామ్సంగ్ ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం బయటి కవర్ స్క్రీన్ పైన 20MP కెమెరాలను కేటాయించారు.త్వరలోనే భారత్‌లోకి వచ్చే ఈ ఫోన్ 12GB రామ్ + 256GB 7,999 యువాన్లు (సుమారు రూ.1,11,000)గా ఉంది.

