Xiaomi 17 Max లాంచ్: Xiaomi కంపెనీ నుంచి కొత్త మొబైల్ వస్తుందని చాలా మంది ఆశిస్తూ ఉంటారు. అందుకు అనుగుణవంగా లేటెస్ట్ గా ఈ కంపెనీ నుంచి 17 మ్యాక్స్ లాంచ్ డేట్ గురించి పూర్తి అప్డేట్ వచ్చేసింది. చైనాలో ఈ ఫోన్ మే చివరి వారంలో లాంచ్ సౌకర్యం. అంటే మే 28 నుంచి 31 మధ్యలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ తరువాత భారత్ లోకి వచ్చే అవకాశం కూడా ఉందని. అయితే ఈ ఫోన్ లాంచ్ కాకముందే దీని వివరాలు బయటకు వచ్చాయి. ఈ ఫోన్ ఎలా ఉండబోతుందంటే?
Xiaomi 17 Max మొబైల్ ను మొదట ఏప్రిల్ 2026 లో లాంచ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ తర్వాత సమాచారం ద్వారా ఇది మే 2026 కి పోస్ట్‌పోన్ అయ్యిందని తేలింది. ఇప్పుడు కంపెనీ చైనీస్ వెబ్సైట్ ద్వారా ఫోన్‌ను టీజ్ చేస్తూ, చైనా మార్కెట్లో మే చివరిలో లాంచ్ అని కన్ఫర్మ్ చేసింది.
Xiaomi 17 Max లో పెద్ద స్క్రీన్ ఉండనుంది. ఇది ఫ్లాగ్షిప్తో పనిచేసే అవకాశం ఉంది. ఇందులో దాదాపు 6.9 OLED డిస్క్ ప్లే ఉండనుంది. ఇది 1.5K రిజల్యూషన్, నేర్‑బెజెల్ లుక్ తో ఉంటాయని లీక్స్ చెబుతున్నాయి. ఇందులో Magic Back Screen ప్రో మోడల్స్ లేకుండా కొంచెం మారి, స్లిమ్, ఫ్లాట్ బాడీ డిజైన్ ఎంపిక చేసుకున్నట్లు. ఫోన్ Xiaomi Dragon Crystal Glass 3 లాంటి హార్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుందని సమాచారం.
ఈ ఫోన్లో Qualcomm Snapdragon 8 Elite Gen 5 చిప్సెట్ ఉండనుంది. ఇది కంపెనీ అత్యంత టాప్ ఆఫ్ ది లైన్ ప్లాట్‌ఫామ్ అని రూమర్స్ చెబుతున్నాయి. ఇందులో 16 GB RAM, 512 GB లేదా 1 TB స్టోరేజ్ వేరియంట్లు కూడా ప్రత్యేకంగా ఉన్నాయని సూచిస్తున్నాయి. ఓఎస్ వైపు చూస్తే Xiaomi HyperOS 3 అని సమాచారం. ఇది బెటర్ మల్టీటాస్కింగ్ కోసం డిజైన్ అయిందని చెబుతున్నారు.
ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నట్లుగా ఉంది. ప్రైమరీ సెన్సార్ 200 MPతో పనిచేసే అవకాశం ఉంది. ఇది 8K వీడియో, హై-రెజి జూమ్, బెటర్ లో-లైట్ పెర్ఫార్మెన్స్ కోసం ఉపయోగపడుతుంది. ఇందులో అల్ట్రా-వైడ్ మరియు టెలిఫోటో లేదా పెరిస్కోప్ లెన్స్ కూడా ఉంటాయని నిరూపించబడింది. దీనితో ఫోటోగ్రఫీ, వీడియో కంటెంట్ క్రియేటర్స్‌కు బెస్ట్ ఆప్షన్‌గా నిలవడం ఖాయం. Xiaomi 17 Max లో సుమారు 8,000 mAh భారీ బ్యాటరీని ఉంచే అవకాశం ఉందని టిప్స్టర్లు చెబుతున్నారు. ఇది Xiaomi బ్రాండెడ్ ఫోన్లలో ఇప్పటి వరకు ఉన్నంత కంటే పెద్దది. దీనికి 100W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది గేమింగ్, హై-రెజ్ వీడియో స్ట్రీమింగ్, లాంగ్-హాల్ టాస్క్‌లకు పర్ఫెక్ట్ గా అమర్చడం పవర్ హౌస్ ఫోన్‌గా నిలుస్తుంది.
ఇండియాకు సంబంధించి ఇప్పటి వరకు 12 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ సుమారు రూ. 89,999 చుట్టూ ధరతో వచ్చే అవకాశం ఉందని టెక్ బ్లాగర్లు గెస్ చేస్తున్నారు. కానీ ఇది ఇంకా ధృవీకరించబడలేదు. చైనాలో ఈ ఫోన్ స్ట్రిక్ట్‌గా లోకల్ మార్కెట్‌కు మాత్రమే లాంచ్ అయ్యే అవకాశం ఉందని కూడా ప్రచారం ఉంది. అంటే గ్లోబల్ వెర్షన్ రిలీజ్ ఉంటుందా లేదా అనేది క్లియర్ కాలేదు.

