వైసీపీ అధినేత జగన్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. బుధవారంఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశం కానున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు…
రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ రచన, ఎస్ఐఆర్ అంశం, పార్టీ కమిటీల నిర్మాణం తదితర కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే చంద్రబాబు ప్రభుత్వ పాలనలో జరిగిన వైఫల్యాలు, సమస్యలు, సమకాలీన రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.పార్టీ బలోపేతం, ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లే కార్యాచరణ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఎండగట్టే అంశంపై కూడా సమగ్ర చర్చ జరగనుంది.

