ఆంధ్రప్రదేశ్: ఆంద్రప్రదేశ్ లో అన్ని ప్రధాన విషయాల్లోనూ అధికార పార్టీని ట్రాప్ చేయడానికి వైసీపీ లాగే ప్రయత్నం చేస్తుంది. ప్రజలకు అవసరమైన అంశాలతో పాటు సామాజికపరమైన అంశాలను కూడా వారికి అనుకూలంగా మలచుకుంటూ, అధికార పార్టీని ఇబ్బందులకు గురిచేస్తుంది. వైసీపీ ట్రాప్ లో కొంత వరకూ టీడీపీ పడుతున్నట్లే కనిపిస్తోంది. ఆ ఒక్కటి చాలదూ.. అన్నట్లు ఇక వైసీపీ నాయకత్వం వేగం పెరిగింది. పాలిటిక్స్ లో హీట్ తగ్గకుండా ప్రతి రోజూ వార్తల్లో నిలిచిపోయేలా చూసుకుంటూ అధికార పార్టీని ఇబ్బందుల పాలు చేయడానికి ప్లాన్ ఎంత వరకూ ఫలిస్తుందో తెలియదు కానీ, కొంత వరకూ సక్సెస్ అయినట్లే కనిపిస్తుంది.
విజయవాడలో సాయికృష్ణ అదృశ్యం కేసులోనూ వైసీపీ రియాక్ట్ అయి బాధిత కుటుంబాన్ని జగన్ పరామర్శించిన తర్వాతనే ప్రభుత్వం వేగంగా స్పందించిందని, తొలుత విచారణకు ఆదేశించి, ఆ తర్వాత సిట్ ను నియమించిందని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది. నిజానికి అప్పటి వరకు విజయవాడలోని టీడీపీ నేతలు కూడా దీనిని పట్టించుకోలేదు. కానీ ప్రధాన సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వైసీపీ ప్రయత్నించడంతో తాము వెనకబడి పోతామన్న భయంతో టీడీపీ పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్న కామెంట్స్ సొంత పార్టీ సోషల్ మీడియాలోనే వినిపిస్తున్నాయి. దీనిని పూర్తిగా కొట్టిపారేయలేని పరిస్థితి.
మరొకవైపు నిన్న వైసీపీ నేతలు రాజధాని అమరావతి పర్యటన పెట్టుకోవడం కూడా అందులో భాగమే. అమరావతికి వెళ్లేందుకు వైసీపీ నేతలు చేసిన ప్రయత్నాలను టీడీపీ నేతలు అడ్డుకుంటారని తెలుసు. కానీ కావాలంటే వైసీపీ నేతలు అమరావతి పర్యటనకు బయలుదేరారు. వారు ఊహించినట్లుగానే టీడీపీ నేతలు దాడికి దిగారు. దీంతో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. అంతే కాదు.. తమకు కావాల్సిన మైలేజీ వైసీపీ తన రాజధాని ప్రయాణాన్ని మానుకుంది. ఇలా అనేక విషయాల్లో అధికార పార్టీని ట్రాప్ లో లాగడం, తమ వల్లనే ఇదంతా ప్రచారం చేసుకుంటూ కూటమి ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. మరి వైసీపీ ఈ నయా పాలిటిక్స్ నుంచి అధికార పార్టీ ఎలా బయటపడుతుందనేది చూడాలి. ఇప్పటికైతే వైసీపీ కొంత మేర ఎఫెన్స్ లో ఉందనే చెప్పాలి.

