అల్లు అర్జున్ లోకేశ్ సినిమా ఆగిపోయింది. ‘పుష్ప’ సిరీస్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ ని ఏ రేంజ్ లో ప్లాన్ చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘పుష్ప 2’ తర్వాత ఎలాంటి తో చేయబోతున్నాడు అనే ప్రశ్నలకు తెరదించుతూ , ఒక సెన్సేషనల్ సైన్స్ ఫిక్షన్ జానర్ ‘రాకా’ చెయ్యబోతున్నాను, ఈ చిత్రానికి తమిళంలో అపజయం అనే డైరెక్టర్ ఎరుగని డైరెక్టర్స్ లో ఒకరైన అట్లీ దర్శకత్వం వహించాడని , ఒక క్రేజీ వీడియోతో సెన్సేషన్ సృష్టించాడు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన రోజు నుండి అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకుంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా మాస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లోనే లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమాని ప్రకటించి మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశాడు .
ఈ ప్రకటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో షేక్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియో కి సంబంధించిన మ్యూజిక్ తో మిలియన్ల సంఖ్యలో రీల్స్ కూడా పడ్డాయి. ఆ రేంజ్ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే అంత గ్రాండ్ గా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అట్టకెక్కిందని ఫిలిం నగర్ లో జోరుగా వినిపిస్తున్న వార్త. చెన్నై లో ఉండే లోకేష్ కనకరాజ్ ని హైదరాబాద్ సంస్థ తీసుకొచ్చింది , ఆయనకు ప్రత్యేకంగా ఒక ఆఫీస్ ని ఏర్పాటు చేసింది మైత్రీ మూవీ మేకర్స్. గత నాలుగు నెలలుగా ఆయన ఆఫీస్ లో తన రైటింగ్ టీం తో కలిసి అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు సంబంధించిన స్టోరీ ని రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యాడు.
రీసెంట్ గా పూర్తి స్థాయి స్క్రిప్ట్ ని అల్లు అర్జున్ కి వినిపించాడట లోకేష్ కనకరాజ్. అతనికి సరిగా లేకపోవడం తో మార్పులు చేర్పులు నచ్చని రమ్మని సూచించాడట. కొన్ని రోజులు తర్వాత అల్లు అర్జున్ సూచించిన మార్పులు చేసి , స్క్రిప్ట్ ని డెవలప్ చేసి గత వారమే వినిపించాడట లోకేష్. కానీ అల్లు అర్జున్ కి ఏ మాత్రం నచ్చలేదట. స్క్రిప్ట్ తో వెళ్తే ఫ్లాప్ తప్పదని భావించిన అల్లు అర్జున్ , ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టినట్లు ప్రస్తుతం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కంటే ముందుగా డైరెక్టర్ ఆయన మలయాళం తో పని చేసేందుకే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నాడట . లోకేష్ కనకరాజ్ తో పూర్తిగా సినిమాని రద్దు చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

