విశాఖపట్నం : విశాఖలోని మత్స్యకారుల గల్లంతు ఘటనలో సెర్చ్ ఆపరేషన్ ముగిసింది. అయితే తప్పిపోయిన జాలర్ల జాడ తెలియలేదు. ఈ నెల 1వ తేదీన సముద్రంలో చేపల వేటకు ఏడుగురు మత్స్యకారులు వెళ్లారు. అయితే బోటు బోల్తా పడి ఆరుగురు జాలర్లు సముద్రంలో గల్లంతయ్యారు.
తెలియని జాలర్ల జాడ…
వీరి కోసం సముద్రంలో 72 గంటల పాటు గాలింపు కొనసాగింది. ఇప్పటివరకు ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభించలేదు. తమ వాళ్ల ఆచూకీ కనిపెట్టాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించాలని కోరుతున్నారు.

