టాలీవుడ్లో సరికొత్త హారర్ సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఒకప్పుడు కేవలం దెయ్యాల కథలతో భయపెడితే.. ఇప్పుడు టెక్నికల్ వాల్యూస్, అదిరిపోయే సౌండ్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్‌ను అందించారు మేకర్స్. ఈ కోవలోనే, థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త భయానక అనుభూతిని పంచడానికి సిద్ధమవుతోంది ‘అమెన్’. ఎస్బీకే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై, రేగుల నీరజరాణి సమర్పణలో, ఆర్ఆర్ఎన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్షన్ రూపొందించబడింది ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబడింది. దర్శక నిర్మాతకే బషీద్ స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ, నిర్మాత ఎస్కే బషీద్ దర్శకుడు మాట్లాడుతూ.. “ఇప్పటివరకు టాలీవుడ్లో వచ్చిన హారర్ సినిమాల ట్రెండ్‌ను పూర్తిగా మార్చేలా ‘అమెన్’ స్టోరీ రూపొందించబడింది. హెచ్చరిస్తున్నాం.. గుండె జబ్బులు (హార్ట్ ప్రాబ్లమ్స్) ఉన్నవాళ్లు ఎవరూ థియేటర్‌కు రావద్దు. ఒంటరిగా ఈ సినిమా చూస్తే ధైర్యం ఎవరికీ ఉండదు. ఇది కుటుంబ సమేతంగా థియేటర్లలో ఆస్వాదించాల్సిన ఒక భయానక అనుభవం. ఔట్‌పుట్‌పై మాకు ఉన్న పూర్తి నమ్మకంతోనే ఈ మేమే స్వయంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

