తెలంగాణ:హైదరాబాద్ మియాపూర్‌లో(మియాపూర్) శుక్రవారం రాత్రి హృదయ విదారక ఘటన జరిగింది.తీవ్ర మానసిక ఒత్తిడి,డిప్రెషన్‌తో బాధపడుతున్న ఓ మహిళ తన ఆరు నెలల పసిపాపతో కలిసి అపార్ట్మెంట్ ఆరవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన చిన్నారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…మియాపూర్ మయూరి నగర్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్ ఈషా సాహు( Eesha Sahu ) (37) శుక్రవారం రాత్రి తన ఆరు నెలల చిన్నారిని చేతుల్లో ఎత్తుకుని భవనం ఆరవ అంతస్తుకు వెళ్లి కిందకు దూకింది.
పెద్ద శబ్దం వినిపించడంతో అపార్ట్మెంట్ నివాసితులు బయటకు వచ్చి చూడగా తల్లి,చిన్నారి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు,అత్యవసర సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
అయితే ఈషా సాహు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.తీవ్ర గాయపడిన చిన్నారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
చిన్నారి ఆరోగ్యపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలింది.ప్రాథమిక తర్వాత తీవ్రస్థాయిలో ఈషా సాహు రెండో బిడ్డకు జన్మనిచ్చిన మానసిక ఒత్తిడి,ప్రవనంతర డిప్రెషన్ (పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్)తో బాధపడుతున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఇటీవల ఆమె ప్రవర్తనలో మార్పులు కనిపించాయని, మానసిక ఆందోళన కారణంగా చికిత్స కూడా పొందుతున్నట్లు తెలిసింది.
కుటుంబ సభ్యుల వాగ్మూలాలు శేఖరిస్తూ, ఆత్మహత్యకు దారితీసిన ఖచ్చితమైన కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా,చిన్నల సంరక్షణతో పాటు తల్లుల మానసిక ఆరోగ్యంపై మరింత అవగాహన అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రసవనం ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్య సలహాలు, కుటుంబ సభ్యుల సహకారం అందించడం ద్వారా ఇటువంటి విషాదాలను నివారించే మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
.


