తెలంగాణ:రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఇంటర్ విద్యాశాఖ శుభవార్త అందించింది.రేడియంట్ ఇన్ఔట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.
ఈ ఒప్పందాల ద్వారా విద్యార్థులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించనుంది.బుధవారం హైదరాబాద్లో ఈ కార్యక్రమంలో ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్( డైరెక్టర్ అభిలాష అభినవ్ ),ఆయా సంస్థల ప్రతినిధులు ఉన్నారు.
ఈ శిక్షణ ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు పెరిగి సులభంగా ఉద్యోగాలు పొందవచ్చని అభిలాష అభినవ్ తెలిపారు.

