మిర్చీ రైతులకు షాకింగ్ న్యూస్ ఇది. ఇండియాలో పండిస్తున్న ఎండు మిర్చీ దిగుమతులను చైనా బ్యాన్ చేసింది. ఈ నిర్ణయం ఎగుమతులపై ఆధారపడిన వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇటీవలే రైస్ దిగుమతిపై బ్యాన్ విధించిన చైనా.. ఇప్పుడు ఎండు మిర్చీపై నిషేధం విధించడం ఆందోళన కలిగించే అంశం.
ఇండియా నుంచి వస్తున్న మిర్చీలో హానికర రసాయనాలు ఎక్కువగా గుర్తించిన చైనా.. దిగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇండియాలో పండే మిర్చీలో మిథామిడోపాస్ రసాయనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కెమికల్ అత్యంత విషపూరితమే కాకుండా.. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎండుమిర్చి ఎగుమతులకు ఇండియా ఎక్కువగా చైనాపైనే ఆధారపడింది. చైనాకు మిర్చీ సరఫరా చేసే దేశాలలో ఇండియా మూడో స్థానంలో ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల 36 వేల టన్నుల ఎండు మిరపకాయలను చైనాకు ఎగుమతి చేశారు. గత ఏడాదితో పోల్చితే ఇది 31 శాతం అధికం. ఈ ఏడాది 19 శాతం పెరిగి.. 7 లక్షల 15 వేల టన్నులకు మన ఎగుమతులు చేరుకున్నాయి.
చైనా దిగుమతి చేసుకునే మిర్చీని ఎక్కువ శాతం ఒలియోరెజిన్ అనే పదార్థం వెలికి తీసేందుకు వినియోగిస్తున్నారు. నేచురల్ స్పైసీ ఫ్లేవర్ కోసం దీన్ని వినియోగిస్తారు. ఒలియో రెజిన్ కోసం ఎక్కువగా తేజ రకం మిర్చిని వినియోగిస్తారు.
ఇప్పటికే బియ్యం ఎక్కువగా గుర్తించి కొన్ని రకాలను బ్యాన్ చేసిన చైనా లెటెస్టుగా మిర్చీని కూడా బ్యాన్ చేయడం. పురుగల మందు అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయి తాత్కాలికంగా బ్యాన్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ధర తక్కువగా ఉండటం, అత్యధిక దిగుమతి కారణంగా చైనా ఇండియన్ మార్కెట్ నుంచి మిర్చీ కొనేందుకు ఆసక్తి చూపుతుంది. 2024-25 తర్వాత భారత్ నుంచి దిగుమతి శాతాన్ని పెంచింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో చైనాకు ఇండియా నుంచి 3 వేల కంటార్లలో మిర్చీ ఎగుమతి జరిగింది. అందులో 10 నుంచి 15 శాతం క్వాలిటీ సమస్యలు వచ్చాయి. తేమ శాతం ఉండటం కొంత అయితే.. పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా కనిపించడంతో వెనక్కు పంపించినట్లు తెలుస్తోంది.

